Nagarjuna next movie: కొరియోగ్రాఫర్ కు ఛాన్స్ ఇచ్చిన నాగార్జున

Nagarjuna next movie

అక్కినేని హీరోలలకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని గత కొద్దిరోజులుగా మీడియాలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా, అఖిల్ నటించిన ఏజెంట్ ఇక నాగ చైతన్య నటించిన కస్టడీ సినిమాలు బ్యాక్ టూ డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇలా అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి సినిమా ఒక దాన్ని మించి మరోకటి డిజాస్టర్ అవుతుండటంతో అక్కినేని హీరోలకు కథల విషయంలో జడ్జ్ మెంట్ లేదంటూ గతకొద్దీ రోజులుగా పుకార్లు వస్తున్నాయి.

అయితే ఈ పుకార్లను ఏమాత్రం పట్టించుకోని అక్కినేని హీరోలు ఎవరికీ తోచిన సినిమాలు వారు చేసుకుంటూ వారి వారి సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నారు. నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తుండగా, అఖిల్ యూవీ క్రియేషన్స్ లో ఒక డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో ధీర( వర్కింగ్ టైటిల్ ) అనేఫాంటసీ సినిమా చేస్తున్నాడు. ఇక అక్కినేని నాగార్జున తన నెక్స్ట్ సినిమా ఒక కొరియోగ్రాఫర్ డైరెక్షన్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

బింబిసార, సార్, సామజవరాగమన, లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు కొరియోగ్రాఫర్ గా పని చేసిన విజయ్ బిన్నీ కి నాగార్జున తన నెక్స్ట్ సినిమా చేయడానికి అంగీకరించాడట. అయితే ఇది స్ట్రయిట్ సినిమా కాదట, మలయాళంలో సూపర్ హిట్టైన ఒక సినిమాకు రీమేక్ అని టాక్ వినిపిస్తోంది. ఇక సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు .

- Advertisement -

ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాని వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేసి, సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నాడట. గతంలో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నయన, బంగార్రాజు చిత్రాలు సంక్రాంతికి రిలీజై , మంచి విజయాన్ని సాధించటంతో నాగార్జున సంక్రాంతి హీరో అయ్యాడు.

ఇక అదే సెంటిమెంట్ నాగార్జున మరోసారి ఫాలో అయ్యి హిట్ కొట్టాలని చూస్తున్నాడట. ఇక ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ను నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆగష్టు 29న ప్రకటించనున్నట్టు సమాచారం అందుతోంది. మరీ ఈ సినిమాతోనైన నాగార్జున హిట్ కొట్టి మరోసారి సంక్రాంతి హీరో అనిపించుకుంటాడా లేదా చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు