Big C event : మహేష్ బాబు షార్ట్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు ?

Big C event

ఇటీవల కాలంలో సెలెబ్రెటీలు వేసుకుంటున్న షార్ట్స్, షూలు, మరియు యాక్సెసరీస్ అందరిని అట్రాక్ట్ చేస్తు.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. అందులోను హీరోలు, హీరోయిన్స్ ధరిస్తున్న యాక్సెరిస్ మరియు బట్టలకైతే మరింత క్రేజ్ లభిస్తుంది. తమ అభిమాన హీరో ధరించిన యాక్సెసరీస్ ధర ఎంత ఉండొచ్చని తెలుసుకోవాలనే కుతూహలం ఆయా హీరోల అభిమానులలో ఎక్కువ కనిపిస్తోంది. దాంతో ఆ హీరోలు వేసుకున్న బట్టలను మరియు యాక్సెసరీస్ ధరలను బ్రేక్ డౌన్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్ పేజెస్ ఆ యాక్సెసరీ ధర ఇంత.. , ఆ షార్ట్ ధర అంత..  అంటూ హైలెట్ చేస్తూ వస్తున్నారు.

ఇక లేటెస్ట్ మహేష్ బాబు ధరించిన  షార్ట్ ధర ఎంత అనే విషయాన్నీ కూడా సోషల్ మీడియా యువత కనిపెట్టారు. దాంతో ప్రస్తుతం మహేష్ వేసుకున్న షార్ట్ ధర పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మిమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవలనే సూపర్ స్టార్ మహేష్ బాబు బిగ్ సి సంస్థ 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొన్నారు. అయితే ఈ వేడుక సందర్భంగా ఆయన కాసేపు మీడియాతో కూడా ముచ్చటించారు.

కాగా ఈ వేడుకకి మహేష్ వేసుకున్న అవుట్ ఫిట్ అందరిని ఆకట్టుకుంది. బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ లో ఉన్న ఒక చెక్ షర్ట్ తో ఆయన కనిపించారు. ఇక ఆ షార్ట్ అందరిని ఆకట్టుకోవడంతో దాని రేట్ ఎంతై ఉంటుందని తెలుసుకోవడం ప్రారంభించారు నెటిజన్లు.

- Advertisement -

ఇక వాళ్ళ రీసర్చ్ లో తెలిసిందంటంటే మహేష్ వేసుకున్న షార్ట్ ధర అక్షరాలా 18 వేలు అని తేలింది. డీజిల్ అనే బ్రాండ్ కు చెందిన ఈ షర్ట్ మహేష్ వేసుకోవడంతో పాపులరై ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతుంది. గతంలో కూడా మహేష్ బాబు తన అవుట్ ఫీట్స్ తో అందరిని అట్రాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక బిగ్ సి ఈవెంట్ లో మహేష్ మీడియాతో తాను ప్రస్తుతం గుంటూరు కారం సినిమా సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తామంటూ చెప్పుకొచ్చాడు. అలాగే రాజమౌళి సినిమా గురించి కూడా ఆయన తొందర్లోనే క్లారిటీ ఇస్తామని తెలిపారు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు