UBS: శ్రీలీల ఆ ఒక్క సినిమా చేసుంటే ఈపాటికి పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయేది

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల గతంలో ఒక సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకుందనే విషయం చాలా మందికి తెలీదు. అయితే ఆ ఒక్క సినిమా గనక శ్రీలీల చేసుంటే గనక ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా, నేషనల్ క్రష్ గా పిలవబడుతున్న ఒక టాప్ హీరోయిన్ ప్లేస్ ను రీప్లేస్ చేసుండేదని మాట్లాడుకుంటున్నారు.

రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిన శ్రీలీల. ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలలోనే ఏ హీరోయిన్ కూడా చేయనన్ని సినిమాలు చేస్తూ, ట్రేండింగ్ లో ఉంది. స్టార్ హీరోల సినిమాల నుంచి యంగ్ హీరోల సినిమాల వరకు అన్ని రకాల హీరోలను కవర్ చేస్తూ టి- టౌన్ లో టాప్ పొజిషన్ లో ఉంది.

అయితే హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన పెళ్లి సందడి సినిమాతో తెలుగులో అరంగ్రేటం చేసిన శ్రీలీల, నిజానికి మొదట ఆ సినిమా చేయవలసింది కాదట. అంతకు ముందే ఈ బ్యూటీని ఒక సూపర్ హిట్ సినిమా కోసం అడగగా, ఆమె చదువు కారణంగా ఈ సినిమా చేయడం కుదరలేదంట. ఇంతకీ ఆ సినిమా ఏంటని అనుకుంటున్నారా ఆ సినిమా పేరు ఛలో. నాగ శౌర్య హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట శ్రీలీలను అనుకున్నారట,

- Advertisement -

కానీ శ్రీలీల ఎగ్జామ్స్ కారణంగా ఈ సినిమా చేయలేదు. దాంతో మేకర్స్ రష్మిక మందన్న ను ఛలో సినిమాలో హీరోయిన్ తీసుకున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఛలో సినిమా మంచి విజయాన్ని సాధించటంతో రష్మికకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చి, ప్రస్తుతం అందరి చేత నేషనల్ క్రష్ గా పిలవబడుతుంది. అయితే ఛలో సినిమా రష్మిక కాకుండా శ్రీలీలనే చేసుంటే రష్మిక ప్లేస్ ను రీ-ప్లేస్ చేసుండేదని అంత అనుకుంటున్నారు. అయితే ఈ విజయాన్ని స్వయంగా హీరో నాగ శౌర్యనే ఇటీవల రంగబలి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పడంతో ప్రస్తుతం ఈ విషయం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు