Jee karda: నేను ఎలా ఉండాలో చెప్పడానికి మీరెవరు- ఆ బ్యాచ్ పై ఫైర్ అయిన తమన్నా

మిల్క్ బ్యూటీ తమన్నా ఇటీవల ఒక ఇంటర్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఎప్పుడు నవ్వుతు, నవ్వించే తమన్నా ఇంత కోపంగా ఎందుకు ఉందని అందరు షాక్ అవుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం తమన్నానే కరెక్ట్ అంటూ, ఆమె చేసిన వ్యాఖ్యలే నిజం అంటూ తమన్నాకు వత్తాసు పలుకుతున్నారు.

ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలు బిజీగా ఉండే తమ్మన్నా జోరు ఈ మధ్య కాస్త తగ్గిందనే చెప్పాలి. ఏజ్ పెరగటం మూలంగానే మరీ కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీకి రావడం మూలంగానే కానీ ఈ మిల్క్ బ్యూటీ కైతే గతంతో పోలిస్తే ఇప్పుడు అవకాశాలు బాగా తగ్గాయని చెప్పొచ్చు. దాంతో తమన్నా టాలీవుడ్ ను పక్కన పెట్టి ప్రస్తుతం బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది.

అయితే ఇటీవలనే తమ్మన్నా జీర్ కార్డా అనే హిందీ వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ లో తమ్మన్నా చాలా వరకు రొమాంటిక్ సీన్స్ లో నటించగా, ఆ క్లిప్స్ ఇంటర్నెట్ లో వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. అర్బన్ రిలేషన్ షిప్స్ నేపథ్యం లో వచ్చిన ఈ సిరీస్ లో తమన్నా కొన్ని సీన్స్ అయితే సెమి న్యూడ్ కూడా కనిపించగా ఆ ఫోటోలు, వీడియోలు ట్విట్టర్ లో వైరల్ అయ్యాయి. అయితే తమన్నా ఇలాంటి పాత్రలు ఎందుకు చేస్తుందని, ఆఫర్స్ కోసం ఎంతైనా దిగజారుతారా అని, తమన్నా బరి తెగించిందని ఇంటర్నెట్ ఆమెని అభిమానించే వాళ్ళు మరియు ట్రోలర్స్ ఎవరి తోచినట్టు వాళ్ళు రాసుకొచ్చారు.

- Advertisement -

అయితే ఈ విధమైన ట్రోల్స్ పై తమన్నా మొదటిసారి ఇటీవల జరిగిన ఒక ఇంటర్యూ లో ఆమె నోరు విప్పింది. నాకు నచ్చింది నేను చేస్తే అసలు ఈ ట్రోలర్స్ కి వచ్చిన నష్టమేంటి.. 2023లో కూడా ఒక అమ్మాయి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్తారా.. అసలు వీళ్ళెవ్వరూ ఇది డిసైడ్ చేయడానికి అంటూ ఘాటుగా స్పందించగా ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు