UBS ; పవన్ కళ్యాణ్ సినిమాకి హీరోయిన్ కష్టాలు- చివరికి ఆ హీరోయినే దిక్కు అయ్యేలా ఉంది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరో పక్క బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేతిలోనాలుగు సినిమాలుండగా, ఈ సినిమాలన్నీ వీలైనంత త్వరగా కంప్లిట్ చేసి వచ్చే ఎలక్షన్స్ మీద పూర్తిగా కాన్సంట్రేషన్ చేయనున్నాడు.

అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన సినిమా లలో హీరోయిన్స్ డేట్స్ పట్టుకోవడం నిర్మాతలకు కష్టంగా మారుతోంది. పవన్ కళ్యాణ్ హీరో అంటే ఆయన పక్కన ఖచ్చితంగా స్టార్ హీరోయిన్స్ ని పెట్టవలసి వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ మీటింగ్స్ వల్ల ఎప్పుడు సినిమా షూటింగ్ స్టార్ అవుద్దో, ఎన్నిరోజుల వరకు షూటింగ్ చేస్తారో చెప్పలేని పరిస్థితి. దాంతో హీరోయిన్స్ డేట్స్ ని, పవన్ కళ్యాణ్ డేట్స్ తో మ్యాచ్ చేసి, షూటింగ్ చేయడం మేకర్స్ కి అతి కష్టమైన పనిగా తోస్తోంది అందుకే పవన్ పక్కన హీరోయిన్ విషయంలో ఎక్కువగా ఆలోచించకుండ ఏ హీరోయిన్ సినిమాలు లేకుండ ఖాళీగా ఉందొ చూసి ఆ హీరోయిన్ నే ఫైనల్ చేస్తునట్టు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తోన్న OG సినిమాలో మరియు హరి హర వీరమల్లు సినిమాలలో హీరోయిన్స్ ను ఇలాగే సెలెక్ట్ చేసారు. OG సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక మోహన్ నటిస్తుండగా, హరిహర వీరమల్లులో పవన్ పక్కన నిధి అగర్వాల్ కనిపించబోతుంది.

- Advertisement -

అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ చేతిలో ప్రస్తుతం పవన్ సినిమా తప్ప వేరే ప్రాజెక్ట్స్ ఏమి లేకపోవడం డేట్స్ విషయంలో ప్రాబ్లమ్ లేకుండా షూటింగ్స్ సజావుగా సాగుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి మాత్రం హీరోయిన్ కష్టాలు తప్పట్లేదు. ఈ సినిమాలో ఇప్పటి వరకు హీరోయిన్ సెలక్షన్ జరగలేదనే టాక్ గట్టిగ వినిపిస్తోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం గాను ఇద్దరు హీరోయిన్స్ కావాల్సి ఉండగా, ఒక హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీలని తీసుకున్నారు. అయితే ఇంకో హీరోయిన్ గా మాత్రం ఎవర్ని తీసుకోవాలో మేకర్స్ కి పాలుపోవట్లేదట, దాంతో అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమాలో హీరోయిన్ గా నటించిన సాక్షి వైద్యను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం తీసుకోనున్నట్టు సమాచారం.

అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా వస్తోన్నగాండీవధారి అర్జున సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తప్ప సాక్షి చేతిలో కూడా వేరే ప్రాజెక్ట్స్ ఏమి లేకపోవడంతో ఈ హీరోయిన్ నే ఫైనల్ చేయనున్నట్టు సమాచారం.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు