Manu charitra: ఈ వారం రిలీజ్ అవ్వబోతున్న సినిమాలపై ఒక లూక్కేయ్యండి

భారీ అంచనాల మధ్య గత వారం రిలీజైన ఆదిపురుష్ సినిమా ప్రేక్షలను తీవ్రంగా నీరాశపరించింది. వేసవి సెలవులకు ముగింపు పలుకుతూ రిలీజైన ఈ సినిమా కోసం ఒకపక్క ప్రభాస్ ఫ్యాన్స్, మరో పక్క సినీ అభిమానులు అందరు ఈగర్ గా వెయిట్ చేయగా, జూన్ 16న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైంది.

ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా , బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో, రామాయణ ఇతిహాసంగా ఆధారంగా తెరకెక్కించబడిన ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

ఆదిపురుష్ సినిమా మీద నమ్మకంతో మీడియం రేంజ్ సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవగా, ఈ వారం అంత థియేటర్స్ లో చిన్న సినిమాల సందడి మొదలవనుంది.

- Advertisement -

ఇక ఈ వారం సినిమాల రిలీజ్ విషయానికొస్తే మేఘ ఆకాష్ హీరోయిన్ గా, శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన మను చరిత్ర మూవీ ఈ శుక్రవారంమే విడుదలవబోతుంది. లవ్& యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి భరత్ పెద్దగాని దర్శకత్వం వహించారు.

వసంత్ రవి హీరోగా, విమల రామన్ హీరోయిన్ గా తరుణ్ తేజ దర్శకత్వంలో అశ్విన్స్ అనే హారర్ సినిమా కూడా ఈ వారమే విడుదవబోతుంది. ఈ సినిమాని ఎస్విసిసి బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.

ప్రముఖ దర్శకుడిగా నిర్మాతగా పలు చిత్రాలు రూపొందించిన మహేష్ భట్ 1920 హర్రర్స్ అఫ్ ది హార్ట్ అనే సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో అవికాగోర్, రాహుల్ దేవ్ ప్రధాన పాత్రలలో నటించిగా, కృష్ణ భట్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

ఈ మూడు సినిమాలతో పాటు భీమాదేవరపల్లి బ్రాంచి, రాముడు అనుకోలేదు జానకి కలగనలేదు,మా ఆవారా జిందగీ, భారీ తారాగణం, జాగ్రత్త బిడ్డ, కుట్ర అనే చిన్న సినిమాలు థియేటర్ లో విడుదలవబోతున్నాయి.

మరీ ఈ వారం పై సినిమాల్లో ఏ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు