Pawan kalyan latest movie : OG రెండు పార్ట్ లుగా రానుందా.. ?

Pawan kalyan latest movie

ఈ వార్త నిజంగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఓజి గురించి అందరికి తెలిసిందే. దానయ్య డివివి నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా రెండు పార్ట్స్ గా రాబోతుందనే న్యూస్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

గత కొద్దీ రోజులుగా టాలీవుడ్ లో ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ గా మరో సినిమాని తీస్తూ హిట్స్ కొడుతుండగా.. సీక్వెల్ సినిమాలకు మరియు రెండు పార్ట్స్ గా తీస్తున్న సినిమాలకు చాలా డిమాండ్ పెరిగింది. ఇప్పటికే తెలుగులో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలా సినిమాలకు పార్ట్ టూ లు అంటూ తీస్తుండగా పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ లో రాబోతున్న OG సినిమాను కూడా రెండు పార్ట్స్ గా తీయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తునట్టు సమాచారం అందుతోంది.

ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్, అప్డేట్స్ అన్నీ సినిమాపై ఉన్న అంచనాలను పెంచుతుండగా, ఈ సినిమా పార్ట్ టూ కూడా తీస్తున్నారనే వార్త ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. ముందు నుంచి భారీ అంచనాలున్న OG సినిమా ఇప్పుడు రెండు పార్ట్స్ గా రాబోతుందనే న్యూస్ తో OG సినిమా ఇంటర్నెట్ లో మరింత వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే సెప్టెంబర్ 2న ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేస్తునట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అదే రోజున OG సినిమాకు సంబంధించి ఈ క్రేజీ రూమర్ లో నిజమెంత వరకు ఉందొ మేకర్స్ రివీల్ చేయనున్నట్టు సమాచారం.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు