Rajinikanth: ఇప్పుడే అర్థమైంది రాజా..! యోగి కాళ్లు మొక్కడంపై సర్వత్ర విమర్శలు

Rajinikanth jailer:

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క కోలీవుడ్ లోనే గాకుండా ఇండియా అంతటా మంచి క్రేజ్ ఉన్న ఈ సౌత్ ఇండియన్ హీరో రీసెంట్ గా జైలర్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆగష్టు10న రిలీజ్ అయిన ఆ సినిమా సూపర్ రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే తాజాగా జైలర్ సినిమాను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రజినీకాంత్ తో కలిసి వీక్షించడం జరిగింది.

అయితే అక్కడ సీఎం ని కలవగానే రజినీకాంత్ అయన కాళ్ళు మొక్కడంపై సోషల్ మీడియాలో పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వయసులో 20ఏళ్ళు చిన్న వాడైనా యోగి కళ్ళు రజినీకాంత్ మొక్కడం ఏమిటి అని, సీఎం హోదాలో ఉన్నంత మాత్రాన రజిని అంత గౌరవం ఇవ్వడమేంటని అని కొందరు విమర్శకులు అంటున్నారు. ఈ విషయంపై రజినీకాంత్ అభిమానులు కూడా పలు విధాలుగా విమర్శిస్తున్నారు. కొందరు తీవ్రంగా విమర్శిస్తే, మరి కొందరు సమర్థిస్తున్నారు.

తమ ఆరాధ్య దైవంగా భావించే రజినీకాంత్ ఒక సీఎం, అది కూడా తన కంటే 20 ఏళ్లు చిన్న వ్యక్తి కాళ్లు మొక్కడాన్ని రజిని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంపై తమిళ మీడియా వర్గాలు కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి. ఆత్మాభిమానం ఎక్కువ ఉన్న తమిళనాడు ప్రజలు దీన్ని రాజకీయంగా కూడా చూస్తున్నారని అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటన అటు సోషల్ మీడియాలో,ఇటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారటం వల్ల తమిళనాట రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది.

- Advertisement -

వాస్తవానికి రజినీకాంత్ కి ఉన్న సూపర్ స్టార్ స్టేచర్ కి, ఫాలోయింగ్ కి ఆయన తలచుకుంటే పది రాష్ట్రాల సీఎంలు అయినా వచ్చి కాళ్ళ ముందు సాష్టాంగ పడతారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటిది రజినీకాంత్ ఒక సీఎం కాళ్ళ మీద పడటం చర్చనీయాంశం అయ్యింది. పైగా ఆత్మాభిమానం ఎక్కువని చెప్పుకునే తమిళ నాడును రిప్రెజెంట్ చేస్తున్న రజినీకాంత్ ఈ పని చేయటం వల్ల హార్డ్ కొర్ రజినీకాంత్ ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

జైలర్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ వచ్చిన నేపథ్యంలో ఉత్సాహంగా ఉన్న రజిని అభిమానులకు తాజాగా జరిగిన ఈ సంఘటన ఆందోళన కలిగిస్తోంది. ఇదే అదును అన్నట్టు యాంటీ ఫ్యాన్స్, రాజకీయ ప్రత్యర్థులు రజిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. రజిని హీరోయిజం సినిమాలకే పరిమితం అని, బయట బీజేపీ చేతిలో కీలుబొమ్మ లాగా మారిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో పార్టీ పెట్టాలని అంతా సిద్ధం చేసుకొని చివరి నిమిషంలో ఆ ఆలోచన ఉపసంహరించుకున్న ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఆత్మాభిమానానికి, ఆత్మగౌవరవానికి పెట్టింది పేరైన తమిళనాడులో ఉంటూ ఏమిటి ఈ బానిసత్వ మెంటాలిటీ అంటూ విమర్శిస్తున్నారు. సూపర్ స్టార్ నిజ స్వరూపం ఏంటో ఇప్పుడు అర్థమయ్యింది రాజా అంటూ టార్గెట్ చేస్తున్నారు నెటిజన్స్.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు