Sunny Deol: 500కోట్ల దిశగా దూసుకెళ్తున్న గదర్2..

Sunny Deol Gadar2

బాలీవుడ్ లో ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో ఎవ్వరూ ఊహించని భారీ విజయం సాధించిన సినిమా గదర్2. బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ సినిమా ఇరవైఏళ్ళ కిందట వచ్చిన గదర్ ఏ ప్రేమ్ కథ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది. అసలు ఈ సినిమా స్టార్ట్ చేసినపుడు బాలీవుడ్ వర్గాల్లో ఎవరికీ అంచనాలు రాలేదు. కానీ టీజర్ రిలీజ్ తో ఒక్కసారిగా సన్నీ ఫ్యాన్స్ మేల్కొని భారీగా ట్రెండ్ చేసారు.

గదర్2 కి పోటీగా అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్2 కూడా రిలీజ్ అవుతున్నా, ఈ సినిమాకే బుకింగ్స్ జరిగాయంటే, ఆ రోజుల్లో గదర్ సృష్టించిన ప్రకంపనలను అర్ధం చేసుకోవచ్చు. 2001లో రిలీజ్ అయిన గదర్ ఆ రోజుల్లోనే వంద కోట్లకి పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు సీక్వెల్ గా వచ్చిన గదర్2 కూడా అదే రేంజ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ అయింది.

గదర్2 సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఒక 150 కోట్లు వసూలు చేస్తే అద్భుతం అని బాలీవుడ్ వర్గాలు అనుకున్నారు. ఎందుకంటే గత 15ఏళ్లుగా సన్నీడియోల్ కి సరైన హిట్ కూడా లేదు. కానీ ఆగష్టు 11న రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే ఏకంగా మూడు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి ఆశ్చర్య పోయేలా చేసింది. ఇక ఈ సినిమా ఇప్పటివరకు ఇండియా లో 330 కోట్లు వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా 430కోట్లకి పైగా రాబట్టి, 500 కోట్ల దిశగా దూసుకువెళ్తుంది.

- Advertisement -

ఇక ఆదివారం నాడు కలెక్షన్లలో భారీ జంప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే విధంగా లాంగ్ రన్ లో ఆడితే గదర్2 ఆరు వందల కోట్ల వరకు కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు