Lokesh Cinematic Universe: లోకేష్ లోకం మొత్తం గందరగోళం..!

Lokesh Cinematic Universe

LCU (Lokesh Cinematic Universe) అనే ఓ లోకాన్ని సృష్టించి, ఒక సౌత్‌లోనే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చాడు లోకేష్ కనగరాజ్, ఈ కొత్త లోకంలో ఫస్ట్ వచ్చిన మూవీ ఖైదీ. తర్వాత విక్రమ్ వచ్చింది. వీటికి సీక్వెల్ కూడా ఉంటాయని ప్రకటించారు. కానీ, ఎప్పుడో అనేది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రస్తుతం లోకేష్ చేస్తున్న మూవీ లియో. ఇది కూడా LCU లో భాగంగానే వస్తుంది.

దీని తర్వాత లోకేష్ నుంచి వచ్చే మూవీస్‌లో ఒకటి రజినీకాంత్‌తో ఉంటుందని, అలాగే మరొకటి సూర్యతో ఉంటుందని కోలీవుడ్‌లో గుస గుసలు వినిపిస్తున్నాయి. లియో తర్వాత రజినీ మూవీ గానీ, సూర్య మూవీ గానీ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే ఈ రెండు సినిమాలు చేస్తే, ఖైదీ 2, విక్రమ్ 2 ఎప్పుడొస్తాయనే ప్రశ్న ఇప్పుడు LCU ఫ్యాన్స్‌కి ఎదురవుతుంది. LCU లో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. లోకేష్ కనగరాజ్‌ని ఇండియాలోనే ది బెస్ట్ డైరెక్టర్స్ లిస్ట్‌లో మొదటి వరుసలో నిలబెట్టాయి.

అలాంటి సినిమాలకు సీక్వెల్స్ వస్తే లోకేష్ క్రేజ్ మరింత పెరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ప్రస్తుతం లోకేష్ లైనప్ చూస్తే, ఈ సీక్వెల్స్ ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదు. పైగా లోకేష్ 10 సినిమాల కంటే ఎక్కు చేయనని, తర్వాత రిటైర్ అయిపోతానని ప్రకటించాడు. అందులో తన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చాడు.

- Advertisement -

వీటికి తోడు టాలీవుడ్‌లో కూడా కొంత మంది స్టార్ హీరోలతో లోకేష్ మూవీస్ చేస్తాడని టాక్ వస్తోంది. ఇటీవల రామ్ చరణ్‌కి ఓ స్టోరీ కూడా చెప్పాడని న్యూస్ వచ్చింది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేకపోయినా, వీరి కాంబోలో ఓ సినిమా ఉంటుందని మాత్రం తెలుస్తుంది. ఇలా చేతి నిండా సినిమాలు ఉండడంతో తాను సృష్టించిన లోకం కాస్త గందరగోళంగా ఉంది అంటూ ఫ్యాన్స్ అంటున్నారు.

ముందుగా ఖైదీ, విక్రమ్ సినిమాలకు సీక్వెల్ చేయాలని అటు కార్తీ ఫ్యాన్స్, ఇటు కమల్ హాసన్ (Kamal Haasan) ఫ్యాన్స్ కూడా అంటున్నారు. కానీ, లోకేష్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీటికీ సీక్వెల్ రావాలంటే కనీసం మూడు నుంచి నాలుగేళ్లు పట్టే అవకాశం ఉంది. ఒక వేళ వీటికీ సీక్వెల్స్ ముందే వస్తే ఎక్కువగా ఖుషి అయ్యేది LCU ఫ్యాన్సే అని చెప్పొచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు