BRO: పాన్ ఇండియా వైడ్ గా బ్రో రిలీజ్.. అసలు విషయమేంటంటే?

BRO Movie Ott:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన సినిమా “బ్రో”. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై28న థియేటర్లలో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా 67 కోట్ల వరకు షేర్ సాధించి బీలో యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుందని అనౌన్స్ మెంట్ వచ్చింది. అదేంటి ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాని మళ్ళీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయడమేంటి అని అనుకుంటున్నారా?

రిలీజ్ చేయడమైతే నిజమే. కానీ అది థియేటర్లలో కాదు, ఓటిటిలో. అసలు విషయానికి వస్తే బ్రో సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. బ్రో సినిమాను ఆగష్టు25న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అయితే దాన్ని తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లాంగ్వేజిలలో, అంటే తమిళ్, కన్నడ, మలయాళ, హిందీలో రిలీజ్ చేస్తున్నారని ప్రకటించారు.

అయితే అన్ని భాషలు కరెక్టే గాని, తమిళ్ లో ఆల్రెడీ ఒరిజినల్ ఉంది, కాబట్టి ఆడియన్స్ చూస్తారా అనేదే విమర్శకుల ప్రశ్న. కానీ నెటిజన్లు మాత్రం బ్రో ఒరిజినల్ వినోదయ సితం కి దీనికి చాలా తేడా ఉంటుంది, కాబట్టి బ్రో ఖచ్చితంగా నచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక బ్రో సినిమా ఇప్పటికే థియేటర్లలో నుండి వెళ్ళిపోగా, పవన్ కళ్యాణ్ రాబోయే సినిమా గురించి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు