Siddhu Jonnalagadda’s Next: ఒక్క హిట్ పడగానే అన్నిట్లో వేలు పెట్టాలా..?

Siddhu Jonnalagadda’s Next

టాలీవుడ్లో మల్టీ ట్యాలెంటెడ్ హీరోలు పెరిగిపోతున్నారు. యాక్టింగ్ తో పాటు డైరెక్షన్ రైటింగ్ లో ప్రావిణ్యం ఉన్న సదరు మల్టీ ట్యాలెంటెడ్ హీరోలు డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. అలాంటి వారిలో హీరో సిద్దు జొన్నలగడ్డ ఒకడు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలా కాలానికి డీజే టిల్లు సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందాడు. డీజే టిల్లు తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ గా చేసిన టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సిద్దు హీరోగా మాత్రమే కాకుండా రైటర్ గా కూడా వ్యవహరించిన ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. టిల్లు స్క్వేర్ సినిమా విషయంలో సిద్దు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవ్వడం వల్లనే ఫస్ట్ పార్ట్ ని డైరెక్ట్ చేసిన విమల్ సీక్వెల్ నుండి తప్పుకోవాల్సి వచ్చిందని టాక్ వచ్చింది అప్పట్లో.
డీజే టిల్లు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ మినహా ఏ ఇతర సినిమాను లైన్లో పెట్టలేదు సిద్దు. సినిమా స్క్రిప్ట్ విషయంలో సిద్దు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువవ్వడం వల్లనే ఏ ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవ్వట్లేదని ఇండస్ట్రీ వర్గాల ఇన్సైడ్ టాక్. ఈ కారణంగానే సిద్దు ఒకే చేసిన మరో ప్రాజెక్ట్ కూడా సెట్స్ మీదకు వెళ్ళటం లేదని సమాచారం. టిల్లు స్క్వేర్ తర్వాత ఓ కొత్త దర్శకుడితో సినిమా కమిట్ అయిన సిద్దు కథలో కళ్ళు వేళ్ళు పెట్టడం వల్ల డైరెక్టర్ తో విభేదాలు వచ్చాయని. ఇప్పుడు ఆ డైరెక్టర్ ఇచ్చిన కథతో వేరే డైరెక్టర్ తో సినిమా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.
అయితే తన కథకి డైరెక్టర్ గా వద్దంటే ఒప్పుకోవటానికి ఏ డైరెక్టర్ అయినా ఒప్పుకోడు కాబట్టి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లటం ఆలస్యం అవుతుందని అంటున్నారు. ఒక్క హిట్ పడగానే ఇలా స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం ఏ హీరోకైనా సరైనది కాదు. రైటింగ్ స్కిల్స్ లాంటి అడిషనల్ ట్యాలెంట్ కెరీర్ కి ప్లస్ అయ్యేలాగా వాడుకోవాలి కానీ, ఇలా బిగినింగ్ స్టేజ్ లో ఉండగానే అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి అసలుకే ఎసరు పెట్టుకోవటం కరెక్ట్ కాదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు