Mass maharaja ravi teja’s: టైగర్ నాగేశ్వరరావు’ మూవీ మిస్ చేసుకున్న స్టార్ హీరో..!

Mass maharaja ravi teja

వంశీ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. 1970 ల్లో దేశంలో అతిపెద్ద దొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వర రావు నిజజీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అలాగే రేణు దేశాయ్, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్, మురళి శర్మ కీలక పాత్రలు పోషించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో టైగర్ నాగేశ్వరరావు మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుండి ఇటీవల విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఖచ్చితంగా ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము లేపుతుందన్న చర్చలు ట్రేడ్ వర్గాల్లో నడుస్తున్నాయి.

అయితే ఈ మూవీలో నాగేశ్వరరావు పాత్ర కోసం మొదట అనుకున్నది రవితేజని కాదట. ఈ పాత్ర కోసం ముందు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని అనుకున్నారట. ఈ సినిమా బడ్జెట్ కంటే మరో రెండింతలు ఎక్కువగా బడ్జెట్ పెట్టి ఈ సినిమా నిర్మించాలని అనుకున్నారట నిర్మాత అభిషేక్ అగర్వాల్. కానీ ప్రభాస్ కి మరో నాలుగు ఏళ్ల పాటు డేట్లు మొత్తం బ్లాక్ అయ్యాయని చెప్పడంతో ఆ తరువాత రవితేజని అప్రోచ్ అయ్యారట. ఒకవేళ ఈ చిత్రంలో ప్రభాస్ నటించి ఉంటే ఈ మూవీ మరో విధంగా ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు