Tillu Square: ట్రెండ్ కి భిన్నంగా వెళ్తున్న సిద్ధూ – వర్కౌట్ అవుతుందా..?

ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతున్నా కానీ, ఆ మధ్య వచ్చిన డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని గుర్తింపు పొందాడు హీరో సిద్ధూ జొన్నలగడ్డ. అదే ఫుత్ ఆ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా స్టార్ట్ చేసి పూర్తీ చేసే పనిలో పడ్డాడు. సిద్దూ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత సిద్దూ సమంతతో కలిసి నందిని రెడ్డి డైరెక్షన్లో ఒక సినిమా, ప్రముఖ స్టయిలిష్ నీరజ కోన డైరెక్ట్ చేయబోయే సినిమాలో నటించనున్నాడని వార్తలొస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాల గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం.

డీజే టిల్లు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సిద్ధూ వరుసగా లేడీ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తుండటం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హిట్స్ ఉన్న సమయంలో స్టార్ డైరెక్టర్స్ కి ప్రిఫరెన్స్ ఇచ్చి కెరీర్ గ్రాఫ్ ని, మార్కెట్ రేంజ్ ని పెంచుకునే ప్రయత్నం చేయాలి కానీ, ఇలా ప్రయోగాలు చేయటం ఏంటని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా, సోగ్గాడే చిన్ని నాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో చిరంజీవి నటించబోయే సినిమాలో కూడా సిద్దూ ఓకే క్యారెక్టర్ చేయనున్నాడన్న వార్తలొస్తున్న నేపథ్యంలో సిద్దు స్ట్రాటజీ ఏంటో అన్న ఆసక్తి నెలకొంది.

ఇప్పుడిపుడే హీరోగా నిలదొక్కుకునే అవకాశాలు వస్తున్న తరుణంలో సిద్దు మెగాస్టార్ సినిమాలో క్యారెక్టర్ చేయటం వల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే, యాక్టింగ్ మాత్రమే కాకుండా, రైటింగ్ డైరెక్షన్లో కూడా ప్రావిణ్యం ఉన్న సిద్దు కథల పట్ల నమ్మకం లేనిదే ఇలాంటి ప్రయోగాలు చేయడు అన్న వాదన కూడా వినిపిస్తోంది. మరి, ఇప్పుడిపుడే కెరీర్ గ్రాఫ్ రైజ్ అవుతున్న సమయంలో సిద్దు చేస్తున్న ప్రయోగాలు సక్సెస్ అవుతాయా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు