Vaishnav Tej: ‘ఆదికేశవ’ అయినా ఆదుకుంటుందా..?

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని 100కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత వచ్చిన కొండపోలం, రంగ రంగ వైభవంగా సినిమాలు ఏ మాత్రం అలరించకపోవటంతో రెండు వరుస ఫ్లాప్స్ అందుకున్నాడు. ప్రస్తుతం వైష్ణవ్ శ్రీ లీలతో కలిసి ఆదికేశవ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబందించిన గ్లింప్స్ విడుదలై ఆకట్టుకుంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్లో రూపొందుతున్న ఆదికేశవ సినిమా హిట్ అవ్వటం వైష్ణవ్ కెరీర్ కి కీలకంగా మారింది. గ్లింప్స్ ద్వారా రివీల్ అయిన స్టోరీ లైన్ ని బట్టి చూస్తే రొటీన్ స్టోరీ అన్న ఫీల్ వస్తున్న ఈ సినిమా టేకింగ్ లో కొత్తదనం ఉంటేనే క్లిక్ అయ్యే ఛాన్స్ ఉందనిపిస్తోంది.

అయితే, వరుస ఆఫర్లతో దూసుకుపోతూ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా ఉన్న శ్రీ లీల, ఈ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. టెంపుల్ బ్యాక్డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో వైష్ణవ్ ఔట్ అండ్ ఔట్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు. మెగాస్టార్ ఆచార్య కూడా టెంపుల్ బ్యాక్డ్రాప్ లో రూపొంది డిజాస్టర్ అయిన క్రమంలో ఆదికేశవ ఆ సెంటిమెంట్ బారిన పడి డిజాస్టర్ అవుతుందా అన్న సందేహం కలుగుతోంది.

ఈ ఏడాది విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని సాయిధరమ్ తేజ్ 100కోట్ల క్లబ్ లో చేరగా ఇప్పుడు వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమా ద్వారా హిట్ కొట్టి తన ఫ్లాప్స్ పరంపరకు బ్రేక్ వేస్తాడా లేదా అన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆదికేశవ సినిమా ఏ మాత్రం అటు, ఇటు అయినా కూడా వైష్ణవ్ కెరీర్ కి కోలుకోలేని దెబ్బ పడే అవకాశం ఉంది. మరి వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న వైష్ణవ్ కి ఆదికేశవ సినిమా ద్వారా బ్లాక్ వస్టర్ దక్కుతుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు