Tillu Square: ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన సిద్ధు ..!

డీజే టిల్లు సినిమాతో హీరో సిద్ధు జొన్నలగడ్డ సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. చాలాకాలం నుండి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న సిద్ధు డీజే టిల్లు బ్లాక్ బస్టర్ అవటంతో ఆ జోష్ తగ్గకముందే ఆ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ను అనౌన్స్ చేశాడు. ఏ ముహూర్తాన ఆ సినిమాను అనౌన్స్ చేసాడో గానీ మొదలైనప్పటి నుండి తెగ రూమర్లు వస్తున్నాయి. డీజే టిల్లు సినిమా డైరెక్టర్ విమల్ కి సిద్ధుకి మధ్య విభేదాల కారణంగానే టిల్లు స్క్వేర్ నుండి అతన్ని తొలగించారంటూ వార్తలొచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదంటూ సిద్ధు ఖండించారు. టిల్లు స్క్వేర్ సినిమా అనుకున్న సమయంలో మొదట విమల్ నే సంప్రదించానని అతను మళ్ళీ అదే ప్రాజెక్ట్ వద్దని కొత్త ప్రాజెక్ట్ చేద్దాం అన్నారని చెప్పుకొచ్చారు.

విమల్ మాటకి గౌరవం ఇచ్చి ఫ్యూచర్ లో కొత్త ప్రాజెక్ట్ చేద్దామని చెప్పిన తర్వాతనే మల్లిక్ ని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చామని అన్నారు. తన వల్లే నేహా శెట్టిని కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించారన్న గాసిప్ కి స్పందించిన టిల్లు టిల్లు స్క్వేర్ సినిమా అనుకున్నపుడు మొదటగా అనుపమనే సంప్రదించామని నేహశెట్టి ఇన్వాల్వ్మెంట్ లేదని అన్నారు. తమపై వచ్చిన రూమర్స్ ని చూసి నవ్వుకునేవాళ్లమని అన్నాడు.

అనుపమ విషయంలో కూడా ఇలాంటి రూమర్సే వచ్చాయని అవి నిజం కాదని, అనుపమ ప్రాజెక్ట్ నుండి తప్పుకోలేదని అన్నారు, తనపై వచ్చిన రూమర్స్ కి స్పందించిన అవసరం తనకు లేదని అన్నాడు సిద్ధు. మొత్తానికి చాలా రోజులు ఎదురు చుసిన తర్వాత ఆశించిన హిట్ అందుకున్న ఈ మల్టీ ట్యాలెంటెడ్ హీరో వచ్చిన క్రేజ్ ని మెయింటైన్ చేస్తూ టిల్లు స్క్వేర్ తో మరొక హిట్ అందుకుంటాడా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు