Akhil: తగ్గనంటున్న ‘ఏజెంట్’ – రిస్క్ అవసరమా..?

అక్కినేని అఖిల్ హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా ఈ నెల 28న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిన్న, మొన్న దాకా సినిమా రిలీజ్ అనుమానాలు ఉండేవి. అయితే ఎట్టకేలకు సినిమా యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచటంతో రిలీజ్ పై క్లారిటీ వచ్చింది. పాన్ ఇండియా రిలీజ్ ను దృష్టిలో పెట్టుకొని రూపొందిన ఈ సినిమా హిందీలో విడుదల కాదంటూ వార్తలొచ్చాయి.

ఇదే విషయంపై అఖిల్ ని మీడియా ప్రశ్నించగా క్లారిటీ ఇచ్చాడు, సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతుందని, కాకపోతే 28న కాకుండా కొంచెం ఆలస్యంగా రిలీజ్ అవుతుందని అన్నారు.
హిందీలో రిలీజ్ చేయటానికి సరైన డేట్ కావాలని, ఆ డేట్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పిన అఖిల్, తనకు ఈ సినిమా తెలుగులో హిట్ అవ్వడం చాలా అవసరం అని అన్నారు. హిందీలో రిలీజ్ చేయాలంటే ప్రమోషన్స్ కి చాలా సమయం అవసరమని తమకు ప్రస్తుతం అంత సమయం లేదు కాబట్టే హిందీలో ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నామని అన్నారు.

కాంతారా లాంటి సినిమాలు హిందీలో ఆలస్యంగా విడుదలై హిట్ అయ్యాయని గుర్తు చేసాడు అఖిల్. అయితే, ఏజెంట్ యూనిట్ ఏ కారణం చేత నిర్ణయం తీసుకున్నారు అన్నది అనవసరం. తెలుగులో హిట్ టాక్ వస్తే పర్వాలేదు కానీ, ఏమాత్రం టాక్ కాస్త అటు ఇటుగా వచ్చినా కానీ హిందీలో లేట్ గా రిలీజ్ చేస్తే వచ్చే మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రావు. అప్పుడు టైమ్ తీసుకొని హిందీలో రిలీజ్ చేయటం వృధా ప్రయాసే అవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు