SSMB28 : పూజా హెగ్డే – త్రివిక్రమ్ పిక్ వైరల్

హారిక& హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో SSMB28 సినిమా వస్తోన్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పటికేసినిమా కి సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది

మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కి పండగ అనే చెప్పాలి గతంలో వీరి కాంబినేషన్ లో అతడు , ఖలేజా సినిమాలు మహేష్ కెరీర్ లోనే మోస్ట్ సెలెబ్రేటేడ్ సినిమాలు. మహేష్ లోని అల్లరిని ఫ్యాన్స్ గత కొద్దీ సంవత్సరాలుగా చాలా మిస్ అవుతున్నారు. అందుకే మహేష్ -త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే  మళ్లి ఖలేజా సినిమాలో మహేష్ చేసిన అల్లరి , అలాగే అతడు లో మహేష్ చేసిన యాక్షన్ రెండు కలిసి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు

అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక లీకెడ్ పిక్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. మహేష్ స్టైల్ గా బ్యాక్ సైడ్ తిరిగి ఎవరితోను మాట్లాడుతున్నాడు. మహేష్ కి కొంచెం దూరంలో త్రివిక్రమ్ గారు పూజాకి సీన్ ఎక్సప్లయిన్ చేస్తున్నారు. చూస్తుంటే ఎదో షాపింగ్ మాల్ లో జరిగే లవ్ సిన్ లాగా అనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే యాక్షన్ , డ్రామా తో పాటు మంచి లవ్ స్టోరీ కూడా ఉండబోతుంది అని తెలుస్తుంది.

- Advertisement -

మహేష్ హీరోయిన్ లని రిపీట్ చేయడం చాలా రేర్ , హీరోయిన్ విషయానికి సంబంధించిన ఏ విషయమైనా డైరెక్టర్ కి అండ్ ప్రొడ్యూసర్స్ కి వదిలేస్తాడు. అయితే త్రివిక్రమ్ గారు మాత్రం రిపీటెడ్ హీరోయిన్స్ ని తీసుకుంటాడు. హిట్ సెంటిమెంట్ ఏమో లేక మళ్ళి కొత్త వాళ్ళతో ఇబ్బంది పడటం ఎందుకు అని అనుకుంటారో కాని గతం లో పని చేసిన వాళ్లనే ఆయన తీసుకుంటాడు. ఇదివరకే పూజా హెగ్డే తో రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా కూడా పూజ తోనే చేస్తున్నారు. చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో మహేష్ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని ఆయన ఆశిస్తున్నారేమో.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు