Tollywood: ఇద్దరిలో క్రిస్మస్ విన్నర్ ఎవరో..? 

పండుగలు వస్తే చాలు తెలుగు రాష్ట్రాల్లో సినిమాల సందడి మాములుగా ఉండదు. పండగలకి టాలీవుడ్ కి విడదీయరాని అనుబంధం ఉంది, ఇండస్ట్రీకి వచ్చే రెవిన్యూలో మేజర్ షేర్ సంక్రాంతి, దసరా లాంటి పండుగల సమయంలో ఆడే సినిమాల వల్ల మాత్రమే వస్తుందనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. గతంలో పెద్ద హీరోల సినిమాలు మాత్రమే పండుగ సమయంలో రిలీజ్ కి పోటీ పడేవి కానీ, ఇప్పుడు సీన్ మారింది చిన్న సినిమాల హీరోలు నిర్మాతలు కూడా పండగ సమయాల్లోనే తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

దీంతో ఇప్పటికే వచ్చే దసరా సంక్రాతి సమయంలో స్లాట్స్ ఫుల్ అయ్యాయి ఇక మిగిలింది క్రిస్మస్ మాత్రమే.   క్రిస్మస్ టైమ్ కి తన సినిమా రిలీజ్ చేసేందుకు విక్టరీ వెంకటేష్ ముందే ప్లాన్ చేసుకున్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్లో వస్తున్న ‘సైన్ధవ్’ సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసారు మేకర్స్. ఇప్పుడు వెంకీ మామకు పోటీగా రేసులోకి నాని వచ్చాడు. కొత్త దర్శకుడు శౌర్యవ్ డైరెక్షన్లో వస్తోన్న నాని 30వ సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

చాలా కాలం తర్వాత యాక్షన్ మూవీతో థియేటర్లలోకి వస్తున్న వెంకటేష్ కి ఈ సినిమా హిట్ అవ్వటం కీలకం. దసరా లాంటి మాస్ సినిమా తర్వాత నాని ఈ సారి సెంటిమెంట్ సినిమాతో వస్తున్నాడు. మరి, ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సీనియర్ అండ్ జూనియర్ హీరోలు క్రిస్మస్ రేసులో ఎలా పోటీ పడతారో, ఎవరు గెలుస్తారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు