Bigg Boss: పార్టీలో ఆ ‘బిగ్ బాస్ బ్యూటీ’ తప్పక ఉండాల్సిందే..!

బిగ్ బాస్, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ రియాల్టీ షో మన దేశంలోకి కూడా ఎంటరై పలు భాషల్లో టెలికాస్ట్ అవుతూ క్రేజ్ సంపాదించుకుంది. ఈ షో ద్వారా కొంత మంది సామాన్యులు సెలెబ్రిటీలు అవుతుండగా మరికొంత మంది సెలెబ్రిటీలు ఉన్న ఫేమ్ పోగొట్టుకొని నవ్వుల పాలైన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే, ఈ షో ద్వారా ఫేమ్ సంపాదించిన ఒక తెలుగు సెలెబ్రిటీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ తో తన వయ్యారాలు ఒలకబోస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తన పైత్యపు చేష్టలతో దారుణంగా ట్రోలింగ్ కి కూడా గురవుతూ ఉంటుంది.

బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో సోషల్ పార్టీలకు మరిగిన ఈ భామ ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో ఏ పర్త్య్ జరిగినా తప్పనిసరి గెస్ట్ గా తయారయ్యిందని టాక్ వినిపిస్తోంది. నిత్యం ఎవరో ఒకరు లక్జరి కార్లలో వచ్చి పికప్ లు, డ్రాప్ లు చేయడం చూసి చుట్టూ పక్కల వాళ్ళు కూడా నోరెళ్లబెట్టిన పరిస్థితి నెలకొంది అని టాక్. పైగా పార్టీకి వెళ్లిన ప్రతిసారి ఖరీదైన గిఫ్ట్స్ అందుకోవటం చూసి తోటి సెలెబ్రిటీలు కూడా ఆశ్చర్యపోతున్నారట. అడపాదడపా టీవీ షోలలో కనిపించటమే తప్ప పెద్దగా సినిమా ఛాన్సులు కూడా రాని ఈ భామ అంతటి లక్జరియుస్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుండటంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

సదరు హాట్ లేడి పాల్గొన్న సీజన్లో ఈమెకంటే అందగత్తెలు ఉన్నా కూడా వారెవరికీ దక్కని క్రేజ్ ఈమెకెలా వచ్చిందంటూ అసూయ పడుతున్నారట మిగతా వారు. ఏదేమైనా తన మితిమీరిన వ్యవహారాలతో వార్తల్లో నిలిచిన ఈ భామ తనకొచ్చిన డిమాండ్ తో నాలుగు సినిమా ఆఫర్లు సంపాదించి సెటిలైతే ఒక అర్థం ఉంటుంది. అలా కాకుండా ఇలా పిలిచిన పార్టీలకంతా తిరుగుతూ వ్యసనాలకు బానిసైతే అతి త్వరలోనే షేప్ ఔట్ అయ్యి రెంటికీ చెడ్డ రేవడిలా మారి ఫేడ్ ఔట్ అయ్యే పరిస్థితి ఖాయం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు