Lady Power star: సత్తా చాటిన హైబ్రిడ్ పిల్ల..!

హీరోయిన్స్ అంటే గ్లామర్ షో మాత్రమే అన్న స్థితికి వచ్చిన ఈ రోజుల్లో ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూ కేవలం తమ నటనతోనే రాణించే హీరోయిన్లు చాలా అరుదు. అలాంటి హీరోయిన్స్ జాబితాలో టాప్ ప్లేస్ లో నిలుస్తుంది కేరళ కుట్టి సాయి పల్లవి. ప్రేమమ్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన సాయి పల్లవి ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే సినిమాలు ఒప్పుకునే హైబ్రిడ్ పిల్ల, చేసిన ప్రతి సినిమాలో తన నటనతో మెప్పిస్తూ వస్తుంది.

ఇటీవల అనౌన్స్ చేసిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో తాను నటించిన ‘గార్గి’ సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు సొంతం చేసుకుంది. ‘గార్గి’ సినిమాలో తండ్రిపై పోరాడే యువతి పాత్రలో నటించి మెప్పించింది. లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ భాషా భేదం లేకుండా అందరికి నచ్చటంతో ఓటీటీలో  తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో డబ్ చేయగా ఇక్కడ కూడా హిట్ అయ్యింది. అయితే, ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చి తన కుటుంబ వ్యవహారాలు చూసుకుంటున్న సాయిపల్లవికి ఈ అవార్డు కారణంగా మళ్ళీ వార్తల్లో నిలిచింది.

వరుస సినిమాలతో తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సాయిపల్లవి సినిమాలకు దూరంగా ఉండటం పట్ల తన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ అవార్డు కారణంగా మళ్ళీ వార్తల్లో నిలవటంతో ఇకనైన తమ అభిమాన హీరోయిన్ మనసు మ్నార్చుకొని సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు