National Crush: క్రేజ్ విషయంలో తగ్గేదే లే..!

గీత గోవిందం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అందం అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది కన్నడ భామ రష్మిక మందన్న. నేషనల్ క్రష్ గా తన యువత గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న రష్మిక పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ హిట్ అందుకొని బాలీవుడ్ లో కూడా ఆఫర్లు సాధించింది. తనదైన శైలిలో స్టేట్మెంట్స్ ఇస్తూ తరచూ వార్తల్లో నిలిచే రష్మిక, మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సినిమా రేటింగ్స్ కి ప్రసిద్ధి అయిన IMDB సంస్థ విడుదల చేసిన ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాలో టాప్ లో నిలిచి తన సత్తా చాటింది.

తాజాగా విడుదల చేసిన ఈ టాప్ టెన్ జాబితాలో రష్మిక మోస్ట్ క్రేజీయెస్ట్ సెలబ్రిటీగా స్థానం దక్కించుకుంది.ఇటీవలే పుష్ప2 కి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా ట్రెండ్ అవ్వటం, ఇటీవలే తన బర్త్ డే ఉండటంతో సోషల్ మీడియాలో రష్మిక గురించి ఎక్కువ డిస్కషన్స్ జరగటమే టాప్ సెలేబ్రిటిగా నిలవటానికి దోహదపడి ఉండచ్చు. ప్రస్తుతం పుష్ప2, నితిన్, వెంకీ కుడుముల సినిమాలతో పాటు పలు దక్షిణాది సినిమాల్లో నటిస్తున్న రష్మిక అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కొనసాగుతుంది.

వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఫోటో షూట్స్ చేస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది రష్మిక. ఒకరకంగా ఇదే ఆమె క్రేజ్ కి కారణం అని చెప్పవచ్చు. పుష్ప2 సినిమాతో నేషనల్ వైడ్ ఫ్యాన్ బేస్ సంపాదించిన రష్మిక తాజాగా వచ్చిన IMDB రేటింగ్ తో మరింత స్పీడ్ పెంచుతుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు