Power Star: ఫైర్ స్టార్మ్ తో హీట్ పెంచిన సుజిత్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు అనౌన్స్ చేసి, ఒక్కొక్కటిగా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షెడ్యూల్ నుండి కొంచెం గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవల సుజిత్ డైరెక్షన్లో ‘ఓజీ’ సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నారు. ఈ నెల 18నుండి 29వరకు జరగనున్న ఈ సినిమా షూట్ లో 5రోజుల పాటు పవన్ పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ పాల్గొనే ఐదు రోజులపాటు హీరో,హీరోయిన్లపై సన్నివేశాలు చిత్రీకనుంచారని సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ లుక్ పోస్టర్ సినిమాకు కావాల్సిన హైప్ క్రియేట్ చేసింది.

తాజాగా సినిమాకు సంబంధించిన వీడియో ఒకటి రిలీజ్ చేసింది ఈ సినిమా యూనిట్.ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్ అంటూ సాగే ఈ వీడియో సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది. థమన్ అందించిన అదిరిపోయే బీజీఎమ్ తో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది. సుజిత్ ఈ సినిమా క్లైమాక్స్ కోసం 16వర్షన్లకు పైగా రాసి కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. గన్స్,బాంబులు, బుల్లెట్స్ తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉన్న ఈ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన పవన్ ఐదు రోజుల ఓజీ షూటింగ్ పూర్తయ్యాక తిరిగి హరిహర షూటింగ్ లో పాల్గొననున్నాడు. పవన్ కళ్యాణ్ కి గన్స్ కి ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఈ క్రమంలో ‘ఒరిజినల్ గ్యాంగ్స్టర్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుకున్న స్థాయిలో అలరించకపోయినా, సుజిత్ సాహో సినిమాలో యాక్షన్ సీన్స్ ని హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కించాడు. ఇదే ‘ ఓజీ’ సినిమాపై ఆసక్తి పెంచే అంశంగా మారింది.తాజాగా విడుదలైన వీడియోతో పాజిటివ్ వైబ్స్ ఇస్తున్న ‘ఓజీ’ అంచనాలను అందుకుంటాడా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు