#RC16: రామ్ చరణ్ కోసం బుచ్చిబాబు అదిరిపోయే ప్లాన్..!

RRR తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో  ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు, ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుండి తరచూ ఏదో ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. సంగీత దిగ్గజం ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయనున్నట్లు ఊహాగానాలు వెలువడగా అది ఆల్మోస్ట్ నిజమే అన్న సంకేతాలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి హల్చల్ చేస్తోంది. ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా వాటిలో ఒకటి కాళ్ళు లేని వికలాంగుడి పాత్ర అన్నది ఆ వార్త సారాంశం.

కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ కథ 1980 బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. ఇందులో రామ్ చరణ్ అన్నదమ్ముల పాత్రల్లో కనిపించనున్నారట.  కాళ్ళు లేని అన్న పాత్ర కబడ్డీ కోచ్ గా వ్యవహరిస్తే, తమ్ముడి పాత్ర టీమ్ కెప్టెన్ గా ఉంటుందట. నిజానికి కబడ్డీ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి, ఈ క్రమంలో బుచ్చిబాబు ఈ స్టోరీని కొత్తగా ఎలా చూపించబోతాడు అన్నది ఆసక్తిగా మారింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విజువల్స్ గ్రాండ్ గా ఉండేట్లు ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా, ప్రతి సీన్ హై లెవెల్లో ఉండేట్లు బుచ్చిబాబు కథా పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ఇటీవల నేషనల్ మీడియాతో మాట్లాడుతూ బుచ్చిబాబు సినిమా గురించి ప్రస్తావించిన రామ్ చరణ్, తన కెరీర్లో రంగస్థలం తర్వాత అంతటి సినిమా అవుతుందని, ఈ సినిమా పట్ల చాలా ఎక్సైటింగ్ గా ఉన్నానని  అన్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. స్టోరీ గురించి వస్తున్న ఊహాగానాలను బట్టి చూస్తే అన్నదమ్ముల రివెంజ్ డ్రామా లాగా రొటీన్ గానే కనిపిస్తున్నప్పటికీ, బుచ్చిబాబు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాడు అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు