Mega157: మెగా అప్డేట్.. తొందర్లోనే షూటింగ్ మొదలు!

Mega157:

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత తొందరగానే కోలుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమా డిజాస్టర్ అవుతుందని ఫ్యాన్స్ తో పాటు ఆయన కూడా ముందే గెస్ చేసారు. అందుకే నష్టాన్ని తగ్గించడానికి వీలైనంత ప్రమోట్ చేసారు. అయినా ఫ్యాన్స్ పట్టించుకోలేదు. అయితే ఆ సినిమాని ఫ్యాన్స్ కూడా తొందరగా మరిచి పోవాలనే చిరు బర్త్ డే రోజు తన 157వ సినిమా అనౌన్స్ చేసారు.

ఈ సినిమా బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. పంచ భూతాల కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను సోసియో ఫాంటసీ చిత్రంగా తెరకేక్కిస్తున్నాడు. ఇక యువీ క్రియేషన్స్ పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కి సంబంధించి ఒక మెగా అప్డేట్ ని చిత్ర యూనిట్ అందించారు. మెగా 157 కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను స్టార్ట్ చేస్తున్నామని చిత్ర యూనిట్ స్టిల్ ద్వారా తెలియచేసారు.

ఆ స్టిల్ లో చిత్ర దర్శక నిర్మాతలతో పాటు, మెగా స్టార్ చిరంజీవి, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు కూడా ఉన్నాడు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్. ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ఆరంభం అవుతుంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా రిలీజ్ 2024 సమ్మర్ లో ఉండబోతుంది.

- Advertisement -

అయితే చిరంజీవి కళ్యాణ్ కృష్ణ తో తన 156 వ సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. మరి ఆ సినిమా ముందు రిలీజ్ అవుతుందా, లేక 157వ సినిమా ముందు రిలీజ్ అవుతుందా అన్నది తెలియడం లేదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు