Naveen Polishetty: మరోసారి మిలియన్ కొట్టేస్తున్న మిస్టర్ శెట్టి!

Naveen Polishetty:

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఒకటి. నవీన్ పోలిశెట్టి అనుష్క శెట్టి జంటగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకోవడమే గాక సూపర్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదట బాలీవుడ్ సినిమా జవాన్ ప్రభావం వల్ల తడబడినా, వీకెండ్ లో ఈవెనింగ్ షో లలో కుమ్మేస్తుంది. ముఖ్యంగా ఓవర్సీస్, నైజాం ఏరియాల్లో జవాన్ కి పోటీగా కళ్ళు చెదిరే కలెక్షన్లు సాధిస్తుంది.

ఇక తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ద్వారా మరో అరుదైన ఫీట్ ని సాధించాడు నవీన్ పొలిశెట్టి. సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్సీస్ లో భారీ కలెక్షన్లను సాధిస్తుంది. ప్రీమియర్ల నుండే ఆడియన్స్ ని బాగా మెప్పిస్తున్న ఈ సినిమా తాజాగా ఆదివారం కలెక్షన్లతో 1 మిలియన్ డాలర్లను అందుకుంది. అయితే నవీన్ పోలిశెట్టి స్వయంగా అమెరికా వెళ్లి మరి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడం వల్ల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కి ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయని చెప్పవచ్చు.

ఇక జాతి రత్నాలు తర్వాత నవీన్ పోలిశెట్టికి రెండో వన్ మిలియన్ డాలర్ సినిమా కావడం విశేషం. ఇక మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 8.55కోట్లకి పైగా షేర్ ని 16కోట్లకి పైగా గ్రాస్ ని వసూలు చేయగా, ఆదివారం వసూళ్లతో ఇరవై కోట్ల మార్క్ ని దాటనుంది. ఇక మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రభావం వల్ల సమంత ఖుషి సినిమా కలెక్షన్లు కూడా పడిపోయాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు