Bhola shankar: చచ్చిన పాముని మళ్ళి చంపాడమంటే ఇదే!

Bhola shankar:

టాలీవుడ్ లో ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో అన్నిటికంటే వరెస్ట్ టాక్ తెచ్చుకున్న సినిమా ఏదంటే చాలా మంది మాట్లాడుకునేది ‘భోళా శంకర్’ గురించే. ఎందుకంటే ఈ సినిమా ఎదుర్కొన్న ట్రోలింగ్ అలాంటిది మరి. నిజానికి డైరెక్షన్ అంత చెత్తగా లేకపోయినా, కొన్ని చెత్త సీన్ల వల్ల భోళా శంకర్ చాలా దారుణమైన రిజల్ట్ ని అందుకుంది. మెగా స్టార్ చిరంజీవి నటించిన సినిమా అన్న మొహమాటం కూడా లేకుండా మెగా అభిమానులే ఈ సినిమాను నిరాకరించారు.

చాలా మంది చిరంజీవి అభిమానులు ఈ సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్ ని తిట్టిపోశారు. చిరంజీవి పాటల కోసమే థియేటర్లకు వచ్చే జనాలు, ఫస్ట్ టైం చిరు పాట వస్తుంటే హాల్ లోంచి బయటికి రావడం చూసారు. అలాంటి ఫలితాన్ని అందుకున్న భోళా శంకర్ సినిమాని తాజాగా ఓటిటి లోను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ భోళా శంకర్ హక్కుల్ని కొనుగోలు చేయగా, ఈ నెల అనగా సెప్టెంబర్ 15నుండి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేయనున్నట్టు ప్రకటించారు.

అయితే మెగాభిమానులు మాత్రం ఈ సినిమాను ఓటిటి లో కూడా చూడడానికి ఇష్టపడడం లేదు. ఆచార్య తర్వాత అలాంటి సినిమా రాకూడదనునకున్న మెగా ఫ్యాన్స్ కి అంతకి మించిన రాడ్ సినిమా మెహర్ రమేష్ ఇచ్చాడంటే ఫ్యాన్స్ ఈ సినిమా పై ఎంత అసంతృప్తిగా ఉన్నారో తెలుస్తుంది. చచ్చిన పాముని మళ్ళీ చంపకండి, అని సోషల్ మీడియా లో ఫ్యాన్స్ పేజీల్లో మిమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు