Beauty Tips: కొరియన్ యాక్టర్స్ బ్యూటీ సీక్రెట్స్… దీని వల్లే ఆ గ్లోయింగ్ స్కిన్

ఈ మధ్య కాలంలో మన రోజువారి అలవాట్లలో స్కిన్ కేర్ అనేది ప్రధానంగా మారుతుంది. అందరికీ ఇప్పుడు తమ స్కిన్‌ని హెల్తిగా ఉంచుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ విషయంపై సినిమా యాక్టర్లు, సోషల్ మీడియా సెలబ్రిటీస్ నుంచి డాక్టర్‌ల వరకు అందరూ వారికి తెలిసిన ఏవో కొన్ని స్కిన్ కేర్ టిప్స్ చెబుతున్నారు.

ఇప్పుడు చూస్తున్న హీరోయిన్ల కంటే, సోషల్ మీడియాలో కనిపించే సెలెబ్రిటీల కంటే ఈ మధ్య కలంలో ఎక్కువ ఆకర్షించిన వాళ్లు K Drama యాక్టర్స్. వీరి స్కిన్ గ్లోని చూసి అలాంటి స్కిన్ తమకు కావాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది నేటి యువత. అయితే, అలాంటి గ్లోయింగ్ స్కిన్, హెల్తి స్కిన్ కావాలి అనుకోవటం తప్పేమీ కాదు. అయితే కొందరు మాత్రం కొరియన్స్ పెరిగిన వాతావరణం, వారి ఆహార పద్ధతుల వల్ల స్కిన్ అలా ఉంటుందని అనుకుంటున్నారు. కొరియన్స్ లాంటి స్కిన్ ఎలా వస్తుందిలే అని నిరాశ పడుతు కూడా ఉన్నారు.

కానీ, ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే… కొరియన్స్‌లా గ్లొయింగ్ స్కిన్ రావాలంటే… కొరియాలోనే పుట్టి పెరిగి ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఎంతో కష్ట పడాల్సిన పని కూడా లేదు. కాస్త శ్రద్ధ పెట్టి, కొన్ని ఉపయోగిస్తూ, రోజు వారి అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే, ఆ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు మనం ఎక్కడ ఉన్నా, రోజులో కాస్త సమయాన్ని మన స్కిన్ కేర్ కోసం కేటాయిస్తే చాలు.

- Advertisement -

ఇప్పుడు ఆ గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్ ఇంగ్రిడిఎంట్స్, వాటి ఉపయీగలు, అలాగే వాటిని ఉపయీగించే పద్దతి గురించి చూద్దాం.

1. GINSENG

జీన్సేన్గ్ అనేది ఓ చిన్న మొక్క. ఇది ఆసియా, నార్త్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాలుగా ఈస్ట్ ఆసియాలో సాంప్రదాయ పద్దతులలో మందులు తయారు చేసే సమయంలో, ఈ మొక్క ను ప్రధానంగా వాడే వారంట. అంత గొప్ప మొక్క ఇది. ఈ మొక్క ను వివిధ రకాల చర్మ వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగించేవారట. ఈ మొక్కలో ఎన్ని ప్రత్యేక గుణాలు ఉన్నాయనేది ఒకసారి ఉపయోగిస్తే మీకే తెలుస్తుంది.

ఆ మొక్క ఉన్న స్కిన్ ప్రొడక్ట్… Dr. Sheth’s Vitamin E & Ginseng Moisturizing Cream

2. Fermented Rice Water

ప్రతి ఇంట్లో బియ్యం ఉంటాయి. మనం రోజు తీసుకునే బియ్యం లోనే ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో మనకే తెలియదు. బియ్యంని శుభ్రపరచుకొని అందులో కొన్ని నీళ్లు పోసి రాత్రి అంత అలా ఉంచేస్తే, ఉదయానికి ఆ బియ్యంలో నుంచి సహజంగా ఔషధ గుణాలు ఆ నీళ్లలో కలిసి ఉంటాయి. ఈ నీళ్లతో జుట్టు శుభ్రపరచుకుంటే ఎంతటి పొల్యూషన్ ఉన్నా.. జుట్టు రాలదు. అలాగే, ఇది చర్మాన్ని క్లీన్ గా, ఆయిల్ చేరకుండా హెల్తిగా ఉంచి ముఖం మీద మొటిమలు కూడా రాకుండ కూడా చేస్తుంది. ఇది మీరు మార్కెట్ లో కొనుగోలు చేసుకొని ఇంకా సులభంగా ఉపయోగించుకోవచ్చు.

దీని కోసం Cosrx Ultimate Nourishing Rice Overnight Spa Mask అనే ప్రొడక్ట్ ని వాడాలి.

3. LICORICE ROOT

లికోరైస్ రూట్ అంటే లికోరైస్ చెట్టు వేరు. ఇందులో ఎన్నో సహజ ఔషధ గుణాలు ఉన్నాయి. కొరియాలో తయారు చేయబడే ఎన్నో సన్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్ లో ఇది ప్రధానం గా వాడుతారు. ఈ పదార్ధం స్కిన్ మీద మచ్చలు ఏర్పడకుండా అలాగే స్కిన్ ని హైడ్రేట్ చేసేందుకు ఎంతో సహాయ పడుతుంది. ఇది ఎండ వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ ని రిపేర్ చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ లికోరైస్ రూట్ Rovectin Skin Essentials Treatment Lotion అనే స్కిన్ ప్రొడక్ట్ లో లభిస్తుంది.

4. BAMBOO EXTRACT

“బాంబు” ని ఆసియాలో ఎన్నో వేల సంవత్సరాలుగా చర్మ వ్యాధులు, ఎన్నో ఇతర సమస్యల నుంచి విముక్తి చేసేందుకు వాడుతున్నారు. ఇందులో కొల్లాజెన్ ని ఉత్పత్తి చేసే సిలికా ఉండటం వలన ఈ పదార్ధం anti-ageing కి కూడా సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ మనలో తగ్గిపోయే కొల్లాజెన్ ని ఈ సిలికా ఉత్పత్తి చేసి యవ్వనం గా చూపిస్తుంది. ఇది అలాగే డార్క్ సర్కిల్స్ ని, మొటిమలని దూరం చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది.

ఇది లభించే ప్రొడక్ట్ పేరు… Lisen Pure Genius Multi – Action Peel Stick

5. BIRCH

కొరియన్స్ వారి రోజు వారి స్కిన్ కేర్ లో తప్పకుండ ఉపయోగించే వాటిలో ఈ బ్రీచ్ జ్యూస్ ఒకటి. ఈ బ్రీచ్ జ్యూస్ లో న్యూట్రిఎంట్స్, మినరల్స్, విటమిన్స్, ఇంకా ఎన్నో గుణాలు ఉంటాయి. ఇది మీ స్కిన్ ని సహజం గా హైడ్రాటింగ్ గా ఉంచుతుంది. ఇది ఎంతటి సెన్సిటివ్ స్కిన్ ఉన్న కూడా ఎంతో ఎఫెక్టివ్ గ పని చేస్తుంది.

ఈ బ్రీచ్ జ్యూస్ ఉండే ప్రొడక్ట్… One Thing Moisture Plus Cream

6. SNAIL MUCIN

ఇది నత్తల నుంచి సహజం గా ఉత్పత్తి అయ్యే ఓ లిక్విడ్. అంటే ఇది మీరు విన్నంత భయంకరంగా ఏం ఉండదు. సాధారణంగా కాస్మెటిక్ లో వాడుకోవడానికి దీన్ని ఫిల్టర్ చేసి, ప్రాసెస్ చేసి కాస్మెటిక్స్ లో కలపటం జరుగుతుంది. అలాగే దీని వాళ్ళ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇప్పుడు డాక్టర్లు చెబుతున్న హైదరాలికి ఆసిడ్, గల్లీ కోలిక్ ఆసిడ్ వేళ్ళు ఎన్నో ఏళ్లుగా ఈ నత్త సారం నుంచి పొందుతున్నారు. అందుకే వారు అంత యంగ్ గా కనిపిస్తారు. ఇది రెగ్యులర్ గా వాడుతూ ఉంటే, చర్మం పై ముడతలు, మచ్చలు ఏవి లేకుండా నిత్యా యవ్వనం గా కనిపిస్తారు.

ఈ నత్త సారం Cosrx Advanced Snail 92 All In One Cream అనే స్కిన్ ప్రొడక్ట్ లో ఉంటుంది.

7. CENTELLA ASIATICA

సెంటెల్ల ఆసియాటికా అనే మొక్క ఆసియాలో మాత్రమే పెరుగుతుంది. ఈ మొక్క ను ఇప్పటికే కొంత కాలంగా దీన్ని ఉన్న హెల్త్ బెనిఫిట్స్ వల్ల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో వాడుతూ ఉన్నారు. మొటిమలు ఉన్న వారికి, మొటిమల వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ కి ఇది దివ్య ఔషధంతో సమానం. సెన్సిటివ్ స్కిన్ ని ఎంతో త్వరగా రిపేర్ చేస్తుంది ఇది. ఈ మొక్క కూడా కొల్లాజెన్ ని ఉత్పత్తి చేసి నిత్యా యవ్వన కాంతి ని ఇస్తుంది.

ఈ మొక్క Dear, Klairs Freshly Juiced Vitamin C Drop Serum అనే ప్రొడక్ట్ లో ఉంటుంది.

8. MUGWORT EXTRACT

ముగ్వార్ట్ ని అష్టమిసియా ఉల్గారిస్ అని కూడా అంటారు. ఇది మెడిసిన్ తయారీ లో ఎంతో కలంగా ఉపయోగిస్తున్నారు. దీన్ని సాధారణంగా టీ లో వేసుకొని తాగుతారు. దీని వాళ్ళ బాడీ లో టాక్సిన్స్ ని దూరం చేసుకోవచ్చు. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచి, మొటిమలను తగ్గించి గ్లోయింగ్ స్కిన్ ని ఇస్తుంది.

ఇది One Thing Artemisia Capillaris Extract ప్రొడక్ట్ లో ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు