Balakrishna New Movie: అప్పుడు అబ్బాయి ఇప్పుడు బాబాయ్… ఫుల్ జోష్‌లో సీనియర్ హీరోయిన్?

నందమూరి బాలకృష్ణ వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి కుర్ర హీరోలకు సైతం పోటీగా నిలుస్తున్నారు. ఈయన నుంచి ఇటీవల వచ్చిన భగవంత్ కేసరి.. తెలుగులో దసరా విన్నర్ గా దూసుకెళ్తుంది. కలెక్షన్ల పరంగా గానీ, టాక్ పరంగా గానీ, బాలయ్య సినిమానే ముందు వరుసలో ఉంది. ఈ సినిమా హిట్ కావడంతో బాలయ్య కొద్ది రోజులు రెస్ట్ తీసుకుని తర్వాత సినిమా చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఈ నటసింహం ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా, తర్వాత సినిమాపై ఫోకస్ పెట్టారట.

బాలకృష్ణ తన తర్వాత సినిమా NBK109 బాబీ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. బాబీ లాస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇప్పుడు బాలయ్యకు కూడా బాబీ ఓ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసుకున్న ఈ మూవీ, బాలయ్య ఎప్పుడు అంటే అప్పుడే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేసుకోనుందట.

అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ వైర్ అవుతుంది. ఈ సినిమాలో కూడా బాలయ్యకు ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. అన్ని సినిమాల్లా.. ఈ NBK109 లో కూడా ఫ్లాష్ బ్యాక్ హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తో ఉండబోతుందని టాక్. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్యకు జోడీగా ఓ హీరోయిన్ నటించబోతుందట. ఆమె ఎవరో కాదు… ప్రస్తుతం లియో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న త్రిష.

- Advertisement -

త్రిష గతంలో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ తో దమ్ము సినిమాలో నటించింది. ఇప్పుడు NBK 109 సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయిందట. దీంతో 11 ఏళ్ల ముందు అబ్బాయితో ఆడిపాడిన త్రిష్, ఇప్పుడు బాబాయ్ తో జోడీ కట్టబోతుంది అంటూ టాలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తుంది. అయితే త్రిష ఏజ్ పెరుగుతున్న కొద్ది అవకాశాలు క్యూ కట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు