NBK109: బాలయ్య ఫైర్ మోడ్ ఆన్… చిరు డైరెక్టర్‌కు గట్టిగానే పడిందిగా?

NBK109

సింహంతో వేట బాలయ్యతో ఆట ఎంత ప్రమాదమో తెలుగు ఆడియన్స్‌కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొటి నటీనటులు బాలయ్యది చిన్నపిల్లల మనసత్వం అంటారు. కానీ, ఆయన ఉగ్ర రూపం చూసిన వాళ్లు మాత్రం… బాలయ్య ఓ ఉగ్రనరసింహుడు అంటారు. బాలయ్య చేతితో దెబ్బలు తిన్న ఫ్యాన్స్ మాత్రం బాలయ్య బాబు చేయి తమకు తగిలింది అది చాలు అంటారు.

ఇక సోషల్ మీడియాలో బాలయ్య వాయిస్‌తో వినిపించే పచ్చి బూతుల గురించి అందరికీ తెలిసిందే. అయితే బాలయ్య ఉగ్రరూపం రీసెంట్‌గా ఓ డైరెక్టర్ చూశాడట. అయిన ఎవరో కాదు.. మెగాస్టార్‌ చిరంజీవికి వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ బాబి. ఈ స్టార్ డైరెక్టర్‌తో బాలయ్య ఓ మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి కొన్ని డైలాగ్స్ రాసి, తన టీంతో బాలయ్య దగ్గరికి పంపించాడట బాబి. ఆ డైలాగ్స్‌ని చూసిన తర్వాత బాలయ్యకు చిర్రెత్తుకొచ్చిందట. బాబీని, ఆయన టీంపై బాలయ్య ఒక్క సారిగా ఫైర్ అయ్యాడని, బూతులతో ఉగ్ర రూపం చూపించాడని టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది. దీంతో బాబీ అన్ని మూసుకుని ఆ డైలాగ్స్‌ని ఛేంజ్ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే…. బాలయ్యతో బాబీ సినిమా మొత్తం ఎలా తీస్తాడో చూడాలి మరి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు