Bigg boss season7: పాపం పల్లవి… బిగ్ బాస్ హౌస్‌లో బేబి సినిమా రిపీట్

Bigg boss season7

తెలుగులోనే అతిపెద్ద టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కొద్దిరోజుల క్రితమే స్టార్ట్ అయినా సంగతి తెలిసిందే. గత ఆరు సీజన్ ల నుంచి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తోన్నఈ షో సెప్టెంబర్ 3న గ్రాండ్ గా మొదలైంది. ఉల్టా పల్టా అనే కొత్త కాసెప్ట్ తో ప్రసారమవుతున్న ఈ షో ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇప్పటి వరకు బిగ్ బాస్ కు సంబంధించి నాలుగు ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో మాత్రం కంటిస్టెంట్ రతిక గురించిన కొన్ని పర్సనల్ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటిస్టెంట్ కొనసాగుతున్న రతిక క్యారెక్టర్ బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య క్యారెక్టర్ ను తలపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

హౌస్ లో యాక్టివ్ గా ఉంటూ, సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉన్న రతిక ను బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య క్యారెక్టర్ తో కంపేర్ చేయడమేంటనీ అనుకుంటున్నారా అయితే మీకు అసలు విషయం తేలియాల్సిందే. రతిక బిగ్ బాస్ కు రాకముందు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కొద్దిరోజులు రిలేషన్ షిప్ ఉందట. రాహుల్ మరియు రతిక కలిసి కొన్ని మ్యూజిక్ వీడియోస్ చేయడంతోఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారి.. చాలా రోజుల పాటు ఈ ఇద్దరు లవర్స్ గా చెట్టాపట్టాలేసుకొని తిరిగారట, కానీ రాహుల్ బిగ్ బాస్ సీజన్ 3 కు కంటిస్టెంట్ గా వచ్చిన తరువాత పునర్నవి భూపాళం అనే కంటిస్టెంట్ తో లవ్ ట్రాక్ నడపడంతో రతిక, రాహుల్ ఇద్దరికీ బ్రేక్ అయిందట.

- Advertisement -

ఇక లేటెస్ట్ గా బిగ్ బాస్ హౌస్ లో చూస్తే రతిక.. పల్లవి ప్రశాంత్ అనే కంటిస్టెంట్ తో క్లోజ్ గా ఉంటోంది. అలాగే ప్రశాంత్ కూడా రతిక పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సరే రాహుల్, రతికలకు బ్రేక్ అప్ అయింది కదా ఇంకో మనిషితో క్లోజ్ గా ఉండటంలో తప్పేముందని ఊరుకుందామనుకుంటే ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చింది రతిక.

నిన్న జరిగిన ఎపిసోడ్ రతిక తన ఎక్స్ -బాయ్ ఫ్రెండ్ రాహుల్ ను మర్చిపోలేకపోతున్నానంటూ బాదా పడింది. దాంతో రతిక పట్ల కాస్త నెగిటివిటీ రావడం ప్రారంభమైంది. ఒక పక్క పల్లవి ప్రశాంత్ తో క్లోజ్ ఉంటూ.. మరోపక్క రాహుల్ ను తలుచుకోవడమేంటని అందరు ఆశ్చర్యపోతున్నారు. అసలు రతిక ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో ఎవరికీ అర్థం కాకపోవుతుండటంతో రతిక ను బేబీ సినిమాలో వైష్ణవి చైతన్యతో పోలుస్తున్నారు నెటిజన్లు.

పల్లవి ప్రశాంత్… రతిక మోజులో పడి మోసపోతున్నాడేమో అంటూ బిగ్ బాస్ ఆడియన్స్ అంటున్నారు. మరి ఈ బిగ్ బాస్ బేబి స్టోరీ… ఎలా ముగుస్తుంది? బేబి సినిమాలానే థర్డ్ పర్సన్ ఎంట్రీ ఇస్తాడా? లేదా రతిక పల్లవి ప్రశాంత్‌తో ఫిక్స్ అయిపోతుందా? లేదా మళ్లీ మాజీ ప్రియుడు చెంతకు చేరిపోతుందా? అనేది ఇప్పుడు సస్పెన్స్…

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు