Bigg Boss Season 7: బిగ్ హౌస్ లో ఆ రహస్యాన్ని బయటపెట్టిన టేస్టీ తేజా

Bigg Boss Season 7

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అసలైన ఎంటర్టైనర్ గా టేస్టీ తేజా ప్రతిరోజు ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచుతూ రెచ్చిపోతున్నాడు. ప్రతి హౌజ్ మేట్స్ తో సరదాగా ఉంటూ తనదైన స్టైల్ లో పంచులు విసురుతూ హౌస్ లో నవ్వులు పంచుతున్నాడు. అప్పుడప్పుడు ఏకంగా బిగ్ బాస్ తోనే పరచికాలు ఆడుతూ బిస్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ను కొదవ లేకుండా చేస్తున్నాడు టేస్టీ తేజా.

అయితే ఇదే సమయంలో టేస్టీ తేజా నిన్న జరిగిన ఎపిసోడ్ లో హౌస్ లో జరుగుతున్న ఒక రహస్యాన్ని బయటపెట్టాడు. అదేంటంటే లాయర్ శుభ శ్రీ మరియు గౌతమ్ కృష్ణల రిలేషన్ షిప్ వ్యవహారం. మొన్న జరిగిన ఫెస్ ది బీస్ట్ అనే టాస్క్ లో భాగంగా గెలిచినా వారిని బిగ్ బాస్ ఇవ్వబోయే మరో టాస్క్ కు కంటిస్టెంట్స్ గా సెలెక్ట్ చేసాడు. అయితే ఆ టాస్క్ లో గెలిచింది కేవలం ఆట సందీప్ మరియు ప్రియాంక లు మాత్రమే కావడంతో కాంపిటీషన్ ఉండాలనే ఉద్దేశ్యంతో మరొకరిని సెలెక్ట్ చేసే పనిలో పడ్డాడు బిగ్ బాస్. ఇక అందులో భాగంగానే నిన్న బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను ఎవరి వాళ్ళు తమదైన స్టైల్ లో ఎంటర్టైన్ చేయాలనీ కోరాడు.

ఇక ఆ తరువాత టేస్టీ తేజాను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన బిగ్ బాస్ హౌస్ లో జరిగే ఒక గాసిప్ చెప్పుమనగా.. తేజా గౌతమ్ కృష్ణ, శుభ శ్రీ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనే విషయాన్నీ చెప్పాడు. అలాగే బిగ్ బాస్ తో మాట్లాడిన తరువాత తాను అదే విషయాన్నీ శుభ శ్రీ దగ్గరికి వెళ్లి కూడా చెప్పాడు. కానీ శుభ శ్రీ మాత్రం ఏవిధంగానూ రియాక్ట్ అవ్వలేదు. కానీ శుభ శ్రీ కూడా గౌతమ్ పట్ల ఆసక్తి కనబరుస్తుందనే ఆమె హావభావాల వల్ల ప్రేక్షకులకు అర్థమవుతుంది. కానీ వీరిద్దరి రిలేషన్ లో మాత్రం జెన్యూనిటీ లేదని కేవలం షో లో ఎక్కువ రోజులు ఉండటానికే వాళ్లిద్దరూ అలా చేస్తున్నారని సోషల్ మీడియా టాక్.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు