Ram charan: లీకైన రెండు నెలలకి వస్తే ఎలా?

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘గేమ్ ఛేంజర్’ ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని శంకర్ షణ్ముగం డైరెక్ట్ చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో భారీ తారాగణం కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. అయితే ఎప్పుడో మూడేళ్ళ కిందట మొదలైన గేమ్ ఛేంజర్ ఇప్పటికి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఆగిపోయిన ఇండియన్ 2 మళ్ళీ మొదలవడమే దీనికి అసలు కారణం.

అయితే గేమ్ ఛేంజర్ సినిమా 80శాతం షూటింగ్ పూర్తయిందని ప్రొడ్యూసర్ దిల్ రాజు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ శంకర్ కమల్ సినిమాపైనే ఎక్కువ ఫోకస్ పెడుతుండడంతో ఫ్యాన్స్ దీన్ని నమ్మడం లేదు. పైగా సినిమా నుండి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ పోస్టర్స్ తప్ప వేరే అప్డేట్స్ ఏమి ఇవ్వలేదు. అయితే రెండు నెలల కిందట ఈ సినిమా నుండి ఒక సాంగ్ లీక్ అయింది. ఆ సాంగ్ ట్యూన్స్ బాగానే ఉన్నా, లిరిక్స్ దారుణంగా ఉన్నాయంటూ చాలా ట్రోలింగ్ జరిగింది.

అయితే ఇప్పుడు ఆ సాంగ్ ని దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. “జరగండి” అనే పేరుతో రిలీజ్ చేయనున్న ఈ సాంగ్ ని, సాంగ్ లీక్ అయినప్పుడే అఫిషియల్ గా రిలీజ్ చేసుంటే మంచి రెస్పాన్స్ వచ్చి ఉండేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

ఎందుకంటే ఆ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియా లో విపరీతంగా స్ప్రెడ్ అయిపొయింది. సో ఇప్పుడు రిలీజ్ చేస్తే అంతగా రెస్పాన్స్ రాదనీ అంటున్నారు. కానీ ‘శంకర్ మార్క్ విజువల్స్’ ఆకట్టుకుంటే సాంగ్ వేరే విధంగా ఉంటుందని కూడా అనుకోవచ్చు. అయితే యూట్యూబ్ రికార్డులు మాత్రం ఈ సాంగ్ క్రియేట్ చేయదనేది వాస్తవం.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు