Game Changer: చరణ్ తో కియారా ఆట పాట దివాళికే!

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని శంకర్ షణ్ముగం దర్శకత్వం వహిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీనికి తోడు చాలా ఏళ్ళ తర్వాత శంకర్ ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇటు రామ్ చరణ్ కి కూడా రాజకీయ నేపథ్యంలో తొలి సినిమా కావడం విశేషం. అయితే దాదాపు మూడేళ్ళ కిందట మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి జరుగుతూనే ఉంది.

ఇక అసలు విషయానికొస్తే గేమ్ ఛేంజర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ తో ఇంతకు ముందే వినయ విధేయ రామ్ లో కలిసి నటించగా, ఆ సినిమా అంతగా ఆడకపోయినా, వీళ్ళ పెయిర్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు రెండో సారి గేమ్ ఛేంజర్ తో జతకట్టనున్నారు. అయితే ఈ సినిమాలో కియారా రామ్ చరణ్
పర్సనల్ అసిస్టెంట్ గా నటిస్తుందని సమాచారం.

ఇక గేమ్ ఛేంజర్ నుండి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప ఏ అప్డేట్ రాలేదని తెలిసిందే. దాదాపు ఆరు నెలల నుండి ఊరించి ఇప్పుడు ఒక సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. లాస్ట్ మంత్ లో గేమ్ ఛేంజర్ నుండి “జరగండి” అనే సాంగ్ లీక్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడే సోషల్ ఇండియా లో డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే స్ప్రెడ్ అయిపొయింది.

- Advertisement -

ఇక ఇప్పుడు ఆ పాటని అఫిషియల్ గా దివాళికి రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ పాటలో రామ్ చరణ్ తో కియారా మాస్ డాన్స్ ఉండబోతుందని తెలుస్తుంది. వినయ విధేయ రామలో సాంగ్స్ ని మించి ఈ సినిమాలో డాన్స్ ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఈ సాంగ్ లో రామ్ చరణ్ కియారా ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తారో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు