Biggboss season 7: ప్రశాంత్ ని అనవసరంగా గెలుకుతున్న భోలే!

స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 7 నాగార్జున చెప్పినట్టుగానే అంతా ఉల్టా పల్టా గా సాగుతుందన్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో హౌస్ మేట్స్ గా కాకుండా కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టి, వైల్డ్ కార్డు సభ్యులు ఎంట్రీ ఇచ్చాకే అందరూ హౌస్ మేట్స్ అయ్యారు. పైగా ఊహించని విధంగా వారానికో కెప్టెన్ మారుతూ ఆట రసవత్తరంగా తయారయింది. ఇక ఈ వారం పూజ మూర్తి ఎలిమినేట్ కాగా, అంబటి అర్జున్ కెప్టెన్ అయ్యాడన్న విషయం తెలిసిందే.

ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లో ప్రశాంత్ రతిక గొడవ గురించి తెలిసిందే. అయితే ఈ గొడవలో రతిక చాలా యాంగ్రీ గా ఉండేది. మొదట్లో రాంగ్ సైడ్ లో వెళ్లిన ప్రశాంత్ ఆ తర్వాత మెల్లి మెల్లిగా ట్రాక్ లోకొచ్చాడు. ఇక రతిక ఎలిమినేట్ అయ్యాక మరింత జోరుతో ఏకంగా కెప్టెన్ కూడా అయ్యాడు. ఇప్పుడు రతిక లక్కీ కంటెస్టెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక రతిక ని పలకరించకుండా కాస్త దూరంగానే ఉన్న ప్రశాంత్, ఎదో మాట వరసకి అన్నట్టు చివర్లో స్వీట్ తినిపించి సైలెంట్ అయ్యాడు.

అయితే ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ భోలే ప్రశాంత్ ని రతిక తో ఎందుకు మాట్లాడలేదని అన్నాడు. రతిక వచ్చిన తర్వాత పెద్దగా మాట్లాడలేదు. డల్ గా ఉన్నావు అని అన్నాడు. దానికి ప్రశాంత్ రిప్లై ఇస్తూ నాకు ఎలాంటి బ్యాడ్ ఫీలింగ్ లేదు. నిన్న మా బాపుని చాలా రోజుల తర్వాత చూసేసరికి అలా సైలెంట్ అయిపోయా అని అన్నాడు.

- Advertisement -

ఇదిలా ఉండగా రతిక తనకి వోట్లు వేసిన వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి ఆరా తీస్తుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు