Biggboss season 7: ఆ ఇద్దర్ని తొక్కేస్తానంటున్న హౌస్ పెద్దన్న!

బిగ్ బాస్ సీజన్ 7 లో ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇంతకు ముందు నామినేషన్ల లో చాలా సార్లు ఆటలో వాళ్ళు చేసే తప్పులని చూపెడుతూ నామినేట్ చేసే వాళ్ళు. కానీ ఈ నామినేషన్ లో ఎక్కువగా ఆట గురించి కాకుండా వాళ్ళు మాట్లాడే మాటల్ని బట్టి నామినేట్ చేసారు. ముఖ్యంగా ఈ నామినేషన్ లో భోలే,శోభా శెట్టి మధ్య గొడవలే ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా జరిగింది. గత వారం మొదలైన రచ్చ ఇంకా జరుగుతూనే ఉంది.

ఈ నామినేషన్ లో శోభా శెట్టి మరింత మొండి వైఖరిని ప్రదర్శించింది. ఈ విషయంపైనే శివాజీ మాట్లాడుతూ తమ నిర్ణయం మార్చుకొమ్మని సలహా ఇచ్చాడు. కానీ శివాజీ మాటలని లెక్క చేయకుండా శివాజీని కూడా నామినేట్ చేసింది శోభా శెట్టి.

ఇదిలా ఉండగా నామినేషన్ల అనంతరం శివాజీ అంబటి అర్జున్ తో మాట్లాడుతూ, ఇది కరెక్ట్ కాదు, వీళ్ళు మరి ఓవర్ చేస్తున్నారు. పెద్ద వాళ్ళు ఒకసారి చెప్పాక వినాలి. ఇలా చేయడం పద్ధతి అనిపించుకోదు, వాళ్ళు గ్రూపిజం ఇప్పుడు చేస్తున్నారు, అంటూ శోభా, ప్రియాంకల పేర్లు వాడకుండా అర్జున్ తో మాట్లాడాడు. టైం చూసి తొక్కేస్తానని అన్నాడు. అర్జున్ కూడా ఇలాంటి బిహేవియర్ ని కంట్రోల్ చేయడానికి తాను హౌస్ మొత్తం మార్చేద్దామనుకున్నా అని అన్నాడు. అయితే శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు శోభా శెట్టి, ప్రియాంకలని ఉద్దేశించే అన్నాడు అని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు