Hanuman: ఏకంగా సంక్రాంతికి షిఫ్ట్ చేశారుగా!

టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ హీరోగా “హనుమాన్” అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ను దాదాపు 10 భాషల్లోవిడుదల చేస్తున్నామని చెప్పి నిర్మాతలు సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఇక ఎప్పుడయితే “హనుమాన్” మూవీ యొక్క అఫిషియల్ టీజర్ వచ్చిందో అప్పట్నుంచి ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమాకోసం బాగా వెయిట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో 1600 VFX షాట్స్ ని వాడుతున్నామని చెప్పిన ప్రశాంత్ వర్మ ఇంకా హైప్ పెంచాడు. అయితే 2023 సమ్మర్ బిగినింగ్ లోనే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా పలు కారణాల వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఫైనల్ గా ఆగష్టు 25న రిలీజ్ చేస్తున్నామని చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమాపై వచ్చిన విమర్శల కారణంగా తమ సినిమాపై జాగ్రత్తపడుతున్నారు మేకర్స్.

తమ సినిమాను ఎటువంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా క్లీన్ గా తెరకెక్కిస్తున్నారు. దీనికోసం తమ సినిమాను వాయిదా వేయడానికి పూనుకున్న్నారు. అయితే చాలా మంది నెటిజన్లు, ట్రేడ్ విశ్లేషకులు కూడా సినిమా బాగా రావాలి కాబట్టి వాయిదా వేసినా పర్లేదు అనుకున్నారు. మహా అయితే మరో నెలరోజులు వాయిదా పడొచ్చు అనుకున్నారు. కానీ ఈరోజు వచ్చిన డేట్ అనౌన్స్ మెంట్ తో చిత్ర యూనిట్ పెద్ద షాక్ ఇచ్చింది. “హనుమాన్” సినిమాను 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించారు.

- Advertisement -

అయితే ఏకంగా ఆరునెలల పాటు వాయిదా వేస్తారని ఎవ్వరూ ఊహించలేదని చెప్పాలి. మరి సంక్రాంతికైనా ఖచ్చితంగా వస్తుందా అంటే డౌటే అనాలి. ఎందుకంటే ఇప్పటికే పెద్ద హీరోల సినిమాలు మూడు బుక్కయ్యాయి. వాటికి పోటీగా ఈ సినిమా వస్తే థియేటర్ల సమస్య ఖచ్చితంగా వస్తుంది. మరి అప్పటివరకు మరో రిలీజ్ డేట్ ప్రకటిస్తారేమో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు