Trivikram: “గురూజీ” సినిమాల్లో ఇది కామన్.. కానీ ఏం లాభం?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కి మిశ్రమ స్పందన రావడంతో మళ్ళీ గురూజీ పై ట్రోలింగ్ మొదలెట్టారు. అజ్ఞాత వాసి టైం లో ఓ రేంజ్ ట్రోలింగ్ త్రివిక్రమ్ పై జరగగా, మళ్ళీ ఇప్పుడు గుంటూరు కారం సినిమా టాక్ తర్వాత ఆడియన్స్ వేసుకుంటున్నారు. ఇక ఈ సారైతే త్రివిక్రమ్ సినిమాల్లో పాయింట్లు వెతికి మరీ లాగుతున్నారు.

అలాంటి పాయింట్లలో ఒకటి, ఫీమేల్ సెకండ్ లీడ్ రోల్. అవును.. త్రివిక్రమ్ ప్రతి సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉంటుంది. కానీ ఆ హీరోయిన్లకి ఏమాత్రం ఇంపార్టెన్స్ ఉండదు. అత్తారింటికి దారేది లో ప్రణీత, సన్ అఫ్ సత్యమూర్తి లో ఆదా శర్మ, అరవింద సమేత లో ఇషా రెబ్బ, అలవైకుంటపురంలో నివేదా పేతురాజ్ ఇలా చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్లను పెట్టుకున్నా, ఆ పాత్రల వల్ల సినిమాకి గాని, ఆ హీరోయిన్ల కెరీర్ కి గాని ఏమాత్రం ఉపయోగపడలేదు.

లేటెస్ట్ గా గుంటూరు కారం లో మీనాక్షి చౌదరి ని సెకండ్ హీరోయిన్ గా పెట్టాడు. ఇక్కడ కూడా హీరోకి వొళ్ళు నొక్కడానికి తప్ప, హీరోయిన్ ఉండి ఏం ఇంపార్టెన్స్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఈ సెకండ్ హీరోయిన్ మీద చేసిన కాన్సెన్ట్రేషన్ కంటెంట్ మీద పెట్టి ఉంటే ఇన్ని విమర్శలకు బలయ్యే వారు కాదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక గుంటూరు కారం లో మీనాక్షి చౌదరి ఒక రకంగా చిన్న స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చిందని మాత్రం చెప్పాలి. కానీ ఈ హీరోయిన్ కి ఈ సినిమా వల్ల ఒరిగేదేమి లేదు. అలా అని పెద్దగా వచ్చిన నష్టం కూడా ఏమి లేదు.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు