Sankranthi Race: “హనుమాన్” విధ్వంసం… టికెట్ ముక్క లేదకడా..?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి రిలీజ్ అయిన సినిమాల్లో “హనుమాన్” మూవీ కూడా ఒకటి. ఈ పండక్కి దాదాపు నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీ అవగా, అందులో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. రేపటితో నా సామి రంగ కూడా థియేటర్లోకి వచేస్తుంది. అయితే రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో కూడా బెస్ట్ టాక్ తెచ్చుకుంది “హనుమాన్” సినిమాకే. గుంటూరు కారం దెబ్బేసిందని ప్రీమియర్లకే తెలిసిపోగా, ఈరోజు రిలీజ్ అయిన సైన్ధవ్ వెంకీ ఫ్యాన్స్ ని మాత్రమే అలరిస్తూ, బీలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

ఇక రిలీజ్ అయిన ఫస్ట్ డే గుంటూరు కారం వల్ల హనుమాన్ సినిమా కి ఎఫెక్ట్ పడగా, రెండో రోజు మాత్రం హనుమాన్ భారీగా థియేటర్లను, షోస్ ని ఆక్రమించేసాడు. ముఖ్యంగా హైదరాబాద్ లో గుంటూరు కారం ని మించి హనుమాన్ కి షోస్ ఫుల్ అవడం విశేషం. గుంటూరు కారం సినిమాకి రెండో రోజు హైదరాబాద్ లో 347 షో లు పడగా, అందులో కేవలం 175 షోలు మాత్రమే ఫుల్ అయ్యాయి. అలాగే సైన్ధవ్ మూవీ కి 163 షోలు పడితే 63 మాత్రమే ఫుల్ అయ్యాయి.

కానీ హనుమాన్ కి హైదరాబాద్ లో రెండో రోజు 147 షోలు పడగా, అన్ని షోలు అంటే 147 షోలు కూడా హౌస్ ఫుల్ అయ్యాయి. అది కూడా నిమిషాల వ్యవధిలోనే.. చిన్న పెద్దా అన్న తేడా లేకుండా ఈ సినిమాకి యూత్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతున్నారు. థియేటర్ల దగ్గర లైన్లో నిలబడే ఓపిక లేక హనుమాన్ మూవీ కి ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే అక్కడ కూడా ఒక్క టికెట్ కూడా దొరకని పరిస్థితి, ఇక ఈ సంక్రాంతి పండగ ముగిసే సరికి హనుమాన్ ఏ రేంజ్ లో వసూళ్ల సునామి సృష్టిస్తాడో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు