Gunturu Karam: టాక్ వచ్చి ఉంటే ఆ అరుదైన రికార్డ్ “మహేష్ బాబు” దే అయ్యుండేది?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన భారీ సినిమాల్లో “గుంటూరు కారం” ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేశాడన్న విషయం తెలిసిందే. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనని రాబట్టుకుంది. అయితే ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో రీజనల్ మూవీస్ పరంగా అల్ టైం రికార్డు గుంటూరు కారం క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఫస్ట్ డే కలెక్షన్లలో రచ్చ చేసిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా చిన్న మార్జిన్ లో ఓ సాలిడ్ రికార్డ్ ని మిస్ అయిందని చెప్పొచ్చు.

అదేంటంటే గుంటూరు కారం సినిమాకి రిలీజ్ అయిన ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 52 కోట్లకి పైగా షేర్ కలెక్షన్లు రాగా, 79 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే నిర్మాతలు మాత్రం 94 కోట్లు వచ్చాయని పోస్టర్స్ వదిలారు. అయితే ఏది ఏమైనా మహేష్ బాబు చేతిలో ఓ అరుదైన రికార్డ్ మిస్ అయింది. ఒక రీజనల్ మూవీ తో వచ్చిన మహేష్ బాబు ఫస్ట్ డే భారీ కలెక్షన్లు కొట్టగా, నెగిటివ్ టాక్ వల్ల నైట్ షో లలో ఈ సినిమా కి తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి.

కానీ గుంటూరు కారానికి గనుక అంచనాలకి తగ్గట్టు సినిమా కి మంచి టాక్ గనుక వచ్చి ఉంటె ఫస్ట్ డే ఖచ్చితంగా 100 కోట్ల కి పైగా గ్రాస్ వసూళ్లు దక్కేవి. పైగా ఒక రీజనల్ సినిమాతో వంద కోట్ల ఓపెనింగ్స్ కొట్టిన క్రెడిట్ మహేష్ బాబుకి దక్కేది. మరి గుంటూరు కారం ఓవరాల్ గా ఎన్ని కలెక్షన్లు రాబడతాడో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు