Naa Saami Ranga: ఈ ఒక్క సినిమా ముగ్గురు హీరోయిన్ల కెరీర్ కి కీలకం?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ కి సిద్ధమవగా అందులో మూడు సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ఇక చివరగా సంక్రాంతికి నాగార్జున నటించిన “నా సామిరంగ” రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాలో నాగార్జున మెయిన్ లీడ్ గా నటించగా సెకండ్ హీరోగా అల్లరి నరేష్, మూడో హీరోగా రాజ్ తరుణ్ నటించాడు. అయితే ఈ ముగ్గురు హీరోలకు, సినిమాలో ముగ్గురు హీరోయిన్లను పెట్టడం జరిగింది.

నాగార్జున సరసన అశికా రంగనాథ్, నరేష్ సరసన మిర్ణా మీనన్, రాజ్ తరుణ్ పక్కన రుక్సార్ ధిల్లాన్..హీరోయిన్లు గా నటించారు. అయితే ఈ సినిమా ఫలితం హీరోలతో పాటు, ఈ ముగ్గురు హీరోయిన్ల కెరీర్ కి కూడా కీలకం కానుంది. ఎందుకంటే ఈ ముగ్గురు హీరోయిన్లకు కూడా తెలుగులో హిట్ లేదు. ఆశికా రంగనాథ్ ఏమిగోస్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వగా ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు నా సామి రంగ ఈమె కెరీర్ కి కీలకం కానుంది.

ఇక మరో హీరోయిన్ మిర్ణా కూడా తెలుగులో నరేష్ పక్కనే ఉగ్రం లో నటించగా ఆ సినిమా అంతగా ఆడలేదు. ఇక ఇప్పుడు నా సామిరంగ లో నరేష్ తో రెండో సారి నటించగా ఈ సినిమా రిజల్ట్ మిర్ణా కి ఇంపార్టెంట్ అయింది. చివరగా రుక్సార్ ధిల్లాన్ ఈ ఇద్దరు భామల కంటే ముందుగానే 2018 లో కృష్ణార్జున యుద్ధంలో నటించగా, ఆ సినిమా అంతగా ఆడలేదు. అయినా సరే ఈ అమ్మాయికి పలు ఆఫర్లు వచ్చినా ఒక్క సినిమా కూడా ఆడలేదు. ఇక రుక్సార్ ధిల్లాన్ కెరీర్ కూడా ఇప్పుడు ఈ సినిమాపైనే ఆధారపడిందని చెప్పొచ్చు. మరి “నా సామిరంగ” హిట్ టాక్ తెచ్చుకుని ఈ హీరోయిన్ల కెరీర్ కి ఏమైనా ఊపునిస్తుందా? లేక రిజల్ట్ అటు ఇటు అయ్యి, హీరోయిన్ల కెరీర్ క్వశ్చన్ మార్క్ లో పడేస్తుందా అనేది తెలియాలంటే రేపటిదాకా ఆగాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు