Saindhav Movie Review: “సైంధవ్” మూవీ రివ్యూ

Critic’s Rating
2
About the movie
విక్టరీ వెంకటేష్ 75 వ సినిమాగా సైంధవ్ రూపొందింది. ‘హిట్’ ‘హిట్ 2 ‘ తో సూపర్ హిట్లు కొట్టిన శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకుడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో ఓ లుక్కేద్దాం రండి :

కథ :
సైంధవ్ కోనేరు (వెంకటేష్) చంద్రప్రస్థ అనే ఊరిలో నివసిస్తూ ఉంటాడు. అతనికి ఓ కూతురు ఉంటుంది. ఆ పాప పేరు గాయత్రి (సారా పాలేకర్). కూతురంటే సైంధవ్ కి ప్రాణం. మరోపక్క వారి పక్కింట్లో ఉండే మనోజ్ఞ (శ్రద్దా శ్రీనాథ్) కి కూడా గాయత్రి, సైంధవ్ అంటే చాలా ఇష్టం. అయితే ఒకరోజు సైంధవ్ కూతురు గాయత్రికి ఎస్ఎంఏ అనే వ్యాధి ఉందని తెలుస్తుంది. ఆమె బ్రతకాలంటే రూ. 17 కోట్లు విలువగల ఇంజక్షన్ చేయాలని డాక్టర్లు చెబుతారు. ఇదే క్రమంలో సైంధవ్ జీవితంలోకి వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) ఎంటర్ అవుతాడు. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? సైందవ్ తో అతనికి ఉన్న శత్రుత్వం ఏంటి? మిత్రా (ముఖేష్ రుషి), మైఖేల్ (జిష్షు సేన్ గుప్తా) లతో వికాస్ మాలిక్ కి ఉన్న గొడవలు ఏంటి? సైంధవ్ చివరికి తన పాపని కాపాడుకోగలిగాడా? అనేది మిగిలిన కథ అని చెప్పాలి.

విశ్లేషణ :
వెంకటేష్ 75 వ సినిమా అనగానే సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. సైంధవ్ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ ను బట్టి.. అది నిజమే అని అర్ధం చేసుకోవచ్చు. కానీ ట్రైలర్.. టీజర్ ఆకట్టుకున్న రేంజ్లో ఆకట్టుకోలేదు. అయినప్పటికీ అంచనాలు తగ్గిపోలేదు. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ల్యాండ్ మార్క్ సినిమా అన్నప్పుడు అభిమానుల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. అందులోనూ వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తుంది అంటే ఫ్యామిలీ ఎలిమెంట్స్, మెయిన్ గా వెంకటేష్ మార్క్ కామెడీ ఉంటే బాగుణ్ణు అని అభిమానులు ఆశిస్తారు. వీటికి పూర్తి భిన్నంగా సైంధవ్ రూపొందింది. ఈ సినిమాలో తండ్రీ, కూతుర్ల మధ్య ఉండే బ్యూటిఫుల్ బాండ్ ను చూపించారు. కానీ వాటికి సరైన కొలతలు లేవు. శైలేష్ కొలను .. తన మార్క్ సైకో ఎలిమెంట్స్ తో సైంధవ్ ని రూపొందించాడు కానీ వెంకటేష్ ఇమేజ్ ను పూర్తిగా గాలికి వదిలేసాడు. పోనీ తన పద్దతిలో అయినా థ్రిల్ చేసి, ఎంగేజ్ చేశాడా? అంటే అలాంటిదేమీ లేదు. హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ ని తీసుకెళ్లి గెటప్ శీను భార్యగా పెట్టాడు. తమిళ స్టార్ హీరో ఆర్యని ఎందుకు తీసుకున్నాడో ఆయనకే తెలియాలి. ముఖేష్ రుషి, జిస్సు సేన్ గుప్తా వంటి వారు సినిమాలో ఎందుకు ఉన్నారో వాళ్ళకే తెలియాలి. అయితే నవాజుద్దీన్ సిద్దిఖీ మాత్రం తన నటనతో ఇంప్రెస్ చేశాడు. అతను సీరియస్ గా చేసిన పాత్రే అయినా అంతా నవ్వుకుంటారు. ఆండ్రియా కూడా బాగానే చేసింది.

- Advertisement -

క్యాస్టింగ్ పరంగా, నిర్మాణ విలువల పరంగా సినిమా రిచ్ గా ఉంది.సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. కానీ కథ, కథనాలకి అవి ఎక్కువైపోయాయి అనుకోవాలి. ఫస్ట్ హాఫ్ పరంగా కొంత పర్వాలేదు అనిపించిన సైంధవ్ .. సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్ గా బోర్ కొట్టిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ లో వెంకటేష్ బాగా చేసినా.. వాటి ప్లేస్మెంట్ అస్సలు బాగోదు. గ్యాప్ లేకుండా అలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి. దర్శకుడు శైలేష్ కొలను.. వెంకటేష్ 75 వ సినిమాగా ఇలాంటి కథ చేయడమే పెద్ద తప్పు. వెంకటేష్ తో ‘విక్రమ్’ లా డ్రగ్స్,మాఫియా బ్యాక్ డ్రాప్, చైల్డ్ సెంటిమెంట్ పెట్టేసి ‘సైంధవ్ ‘ ని చేయాలి అనుకున్నాడు. కానీ ‘విక్రమ్’ రేంజ్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండాలి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండాలి అనే విషయాన్ని వదిలేశారు. పాటలు కూడా ఏవీ గుర్తుండవు.

ప్లస్ పాయింట్ :

వెంకటేష్

నిర్మాణ విలువలు

నవాజుద్దీన్ సిద్దిఖీ

మైనస్ పాయింట్స్ :

కథలో కొత్తదనం లేదు

సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

సెకండ్ హాఫ్

క్లైమాక్స్

మొత్తంగా ‘సైంధవ్’ లో ఆశించిన మెరుపులు ఏమీ లేవు. వెంకటేష్ ను అభిమానించేవారు సైతం ‘సైంధవ్’ కోసం థియేటర్ కి వెళితే నీరసంగా బయటకి వస్తారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు