Udayabhanu: గోల్డెన్ లేడీ ఈజ్ బ్యాక్.. త్వరలో..!

Udayabhanu: ఒకప్పుడు బుల్లితెరపై ఫేమస్ ఫీమేల్ యాంకర్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఉదయభాను గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రతి ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో యాంకరింగ్ చేసి భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె పలు సినిమాలలో కూడా నటించి అంతకుమించి పాపులారిటీ దక్కించుకుంది. తను యాంకరింగ్ చేసిందంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు ఆ షో ని కచ్చితంగా చూస్తారు అని మేకర్స్ కి ఒక గట్టి నమ్మకం కూడా ఉండేది. అలాంటి ఉదయభాను మెల్లగా తన యాంకరింగ్ కెరీర్ కి దూరమై పర్సనల్ జీవితంపై దృష్టి పెట్టింది.

అయితే చాలా సంవత్సరాల తర్వాత జీ తెలుగులో జరిగిన ఒక ఈవెంట్లో తన పిల్లలతో కలిసి కనిపించింది ఉదయభాను. అంతేకాదు అదే ఈవెంట్లో తాను మళ్ళీ యాంకర్ గా తన జీవితాన్ని మొదలు పెడతానని మాట కూడా ఇచ్చింది .అప్పటినుంచి పలు ఈవెంట్స్ కి యాంకర్ గా వ్యవహరిస్తున్న ఉదయభాను.. తాజాగా జీ తెలుగులో ప్రసారం కానున్న ఒక షో తో హోస్ట్ గా మరొకసారి తన కెరియర్ ను మొదలు పెట్టబోతోంది.

“సూపర్ జోడి “అనే డాన్స్ షో జీ తెలుగులో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ షో కి సీనియర్ హీరోయిన్ మీనా, ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ తో పాటు మరో సీనియర్ నటిమని శ్రీదేవి విజయ్ కుమార్ కూడా జడ్జ్ లుగా వ్యవహరించబోతున్నారు. ఇక ఈ షో ద్వారానే ఉదయభాను హోస్టుగా రీఎంట్రీ ఇవ్వబోతోంది. అందుకు సంబంధించిన ప్రోమోని కూడా విడుదల చేశారు మేకర్స్..

- Advertisement -

” అమ్మ చెప్పేది.. అమ్మగా గెలిస్తేనే అన్నింటిలో గెలిచినట్టు అని.. అమ్మను అయ్యాకే అమ్మ చెప్పింది గుర్తొచ్చింది.. అన్ని పక్కన పెట్టేసాను.. పిల్లలే జీవితం అయిపోయారు.. నాకు అమ్మలు అయిపోయారు..” అంటూ ఉదయభాను తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతున్న మాటలతో ఒక ప్రోమోని విడుదల చేశారు. అదే సమయంలో “ఆపొద్దు అమ్మ ” అంటూ తన పిల్లలు చెప్పడం.. సూపర్ జోడితో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చినట్లు ప్రకటించింది. అంతేకాదు “గోల్డెన్ లేడీ ఆఫ్ జీ తెలుగు ఈజ్ బ్యాక్” అనే ట్యాగ్ తో ఉదయభాను ప్రోమోని విడుదల చేశారు..

జీ తెలుగు లో సూపర్ జోడి షో జనవరి 28 రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుందని కూడా రివీల్ చేశారు. ఇకపోతే ఈ షో తో ఉదయభాను మళ్ళీ హోస్ట్ గా రీఎంట్రీ ఇవ్వడం బాగుంది అంటూ కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు .మరి కొంతమంది ఇది సెలబ్రిటీ డాన్స్ షో కావడంతో.. షో పై ఆసక్తి పెంచుకుంటున్నారు. మరి ఈ డాన్స్ షో తో హోస్ట్ గా ఉదయభాను ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు