Uday Bhanu: బాలయ్య అలాంటివాడే.. ఎవడు ఏం పీకలేడు – ఉదయభాను..!

ప్రముఖ బుల్లితెర యాంకర్ గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఉదయభాను గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఉదయభాను, ఝాన్సీ మధ్య యాంకరింగ్ విషయంలో ఎప్పుడు మంచి పోటీ ఉండేది. ఇక ఉదయభాను అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు లేరని చెప్పాలి. కొన్ని సంవత్సరాల పాటు యాంకర్ గా ఎంతో బిజీగా కొనసాగిన ఈమె పెళ్లి తర్వాత ఇప్పుడు యాంకరింగ్ కి దూరంగా ఉంటుంది.

ఇకపోతే బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా పలు చిత్రాలలో నటించి మెప్పించిన ఈమె అనుకున్నంత స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరం అవ్వడం నిజంగా అభిమానులను కలవర పెట్టిందని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మళ్లీ యాంకర్ గా అవతారం ఎత్తిన ఈమె అఖండ సక్సెస్ మీట్ లో బాలయ్య గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. బాలయ్య బాబు లాంటి మహానుభావుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే చూడలేదని.. ఎవరు ఏమనుకున్నా సరే.. తనకు ఎవరు మరో షో ఇవ్వకపోయినా సరే.. తన గుండెల మీద చెయ్యి వేసుకుని చెబుతున్నానని.. బాలయ్య బాబుకు వేరెవరు సాటి లేరని.. హాట్సాఫ్ బాలయ్య.. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటూ ఆమె తెలిపింది.

అంతేకాదు మిమ్మల్ని దగ్గర నుండీ చూసిన ఎవరైనా సరే గుండెల్లో గుడి కడతారు. ఎన్నోసార్లు నేను బాలయ్య బాబు సినిమా ఈవెంట్లు చేశాను. పిల్లలు పుట్టకముందు చాలా బిజీగా ఉండే దాన్ని. అంతేకాదు ఏదైనా ఈవెంట్ ఉంటే బాలయ్య బాబు గారే అందరికంటే ముందు వచ్చేవారు. మిగతా హీరోలలా కాకుండా హడావిడి లేకుండా వచ్చి కూర్చునేవారు. రిక్వెస్ట్ చేస్తే చివరి టెక్నీషియన్ వరకు గిఫ్ట్ ఇచ్చే వరకు ఉండండి సార్ అంటే ఏమాత్రం ఆలోచన చేయకుండా అక్కడే నిల్చొని అందరినీ ఆశీర్వదించి వెళ్లేవారు. ఇక వారికి ఎన్ని సార్లు థాంక్స్ చెప్పానో నాకే తెలుసు.

- Advertisement -

అయితే ఆ సమయంలో నా పైన ఎన్నో ట్రోల్స్ నడిచాయి. కానీ నేను లెక్క చేయలేదు. బాలయ్య బాబుకి అభిమానులుగా మారిన ఎవరైనా సరే దేనికైనా తెగిస్తారు. ఇప్పుడు బాలయ్య లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. మిగతావారు ఏం పీకిన సరే ఐ డోంట్ కేర్ అంటూ కామెంట్లు చేసింది ఉదయభాను

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు