Niharika: విడాకుల తర్వాత నిహారికకు జరిగేది ఇదే.. వేణుస్వామి సంచలన కామెంట్స్..!

కొణిదెల నాగబాబు కూతురు మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిహారిక చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏవో కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. వీరి విడాకుల వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. జనాలందరూ ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. పెళ్లయిన రెండు సంవత్సరాలకే నిహారిక విడాకులు తీసుకోవడంతో మెగా అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అయితే చైతన్యతో విడాకుల తర్వాత నిహారిక జీవితం ఇలా ఉండబోతుందంటూ ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదే సోషల్ మీడియా పుణ్యమా అని వేణు స్వామి చాలా ఫేమస్ అయిన విషయం మనకి తెలిసిందే. స్టార్ సెలబ్రిటీలపై ఈయన చేసే కామెంట్స్ ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఆయన చెప్పేది అప్పుడప్పుడు నిజం కావడంతో సెలబ్రిటీలు కూడా ఆయన వెనకాల పడుతున్నారు.

ముఖ్యంగా ఇండస్ట్రీలోని పలు హీరోయిన్లు వేణు స్వామితో పూజలు కూడా చేయించుకుంటున్నారు. ఇలా ఉంటే.. నిహారికకి, జొన్నలగడ్డ చైతన్యకి విడాకులు అయిన తర్వాత నిహారిక జాతకం కూడా శ్రీజ జీవితం లాగే ఉండబోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు వేణు స్వామి. అంతేకాకుండా నిహారిక రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఆమెకు కలిసి రాదని అన్నారు. నిహారిక కి అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేదని అన్నారు. అయితే దోష పరిహారం చేస్తే ఏమైనా ప్రయోజనం ఉండవచ్చని చెప్పుకొచ్చారు వేణు స్వామి. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు