Vimala raman: ఆ స్టార్ విలన్ తో ప్రేమాయణం నడుపుతున్న తెలుగు హీరోయిన్..!

సినీ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమాయణం ఎప్పుడు ఎలా మొదలవుతుందో చెప్పడం చాలా కష్టం. అయితే కొంతమంది సరైన వయసులోనే పెళ్లి చేసుకుని తల్లిదండ్రులవుతుంటే మరికొంతమంది నాలుగు పదుల వయసులో కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారు. అయితే మరికొంతమంది మాత్రం వయసు ముదిరిపోతున్న సమయంలో సరికొత్తగా ప్రేమలో పడుతూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ తెలుగు హీరోయిన్ విమల రామన్ కూడా ఒకరు. ఈమె వయసు ప్రస్తుతం 41 సంవత్సరాలు.

ఈ వయసులో ఈమె ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒక స్టార్ విలన్ తో ప్రేమలో పడిందనే వార్తలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి.

2009లో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఇచ్చిన ఈ బ్యూటీ ప్రారంభంలోనే హీరోయిన్ గా చేసి గ్లామర్ పరంగా మంచి పేరు దక్కించుకుంది. సరైన హిట్స్ పడకపోయినా సరే సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ హాట్ బ్యూటీగా పేరు దక్కించుకుంది. ఇక ఏడాది రిలీజ్ అయినా గాండీవదారి అర్జున, అశ్విన్స్ వంటి సినిమాలలో చేసిన ఈమె రుద్రంగి అనే సినిమాలో కూడా మంచి పాత్ర పోషించిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలేవి కూడా ఈమెకు విజయాన్ని అందించలేదు.

- Advertisement -

ఇకపోతే ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన విమల రామన్ 2004లో మిస్ ఇండియా ఆస్ట్రేలియా టైటిల్ ను గెలుచుకున్న తర్వాత సినిమాలలో అవకాశాలు దక్కించుకొని పేరు సొంతం చేసుకుంది.

ఇకపోతే గ్లామర్ ఫీల్డ్ లో ఉంటూ హాట్ బ్యూటీగా పేరు దక్కించుకున్న ఈ భామ ఈ వయసులో కూడా అవకాశాలు వస్తుండడంతో పెళ్లి గురించి ఆలోచించలేదు. అయితే తాజాగా వినయ్ రాయ్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని విమల రామన్ నేరుగా వెల్లడించలేదు. కానీ ఇన్స్టాలో ఒక పోస్ట్ రూపంలో అతడితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది.

మొత్తానికైతే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తుండగా.. వాటికి మరింత బలం చేకూరుస్తూ ఇలా ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను విమల రామన్ పోస్ట్ చేయడంతో వీరిద్దరి రిలేషన్ కన్ఫర్మ్ అయినట్టు చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతం ఈమె చేతిలో సినిమాలు పెద్దగా లేని కారణంగా ఈ ఏడాది వివాహం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు