Mansoor Ali Khan – Trisha: బడా స్టార్లు అందరూ సైలెంట్… ఫ్రెండ్‌షిప్ అడ్డొస్తుందా?

గత కొన్ని రోజుల నుంచి ఎక్కడా చూసిన మన్సూర్ అలీ ఖాన్ పేరే వినిపిస్తుంది. త్రిషపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత నెట్టింట్లో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి వాడికి ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల అయితే మన్సూర్ పై మరింత మండిపడుతున్నారు.

ఎందుకంటే.. తాను త్రిషపై చేసిన వ్యాఖ్యల్లో తప్పేం లేదని, అందుకు తాను క్షమాపణలు చేప్పడానికి కూడా రెడీగా లేనని అన్నారు. అంతే కాదు.. తనకంటే… నీచమైన వాళ్లు సమాజంలో చాలా మంది ఉన్నారని వాళ్లని పోలీసులు అరెస్ట్ చేయాలి అంటూ కాస్త పొగరుగా మాట్లాడాడు. ఈ మటలతో ఒక తమిళ ఇండస్ట్రీ నుంచే కాదు.. తెలుగు, సౌత్, నార్త్ నుంచి కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు నెటిజన్లే స్పందిస్తున్నారే కానీ, స్టార్ హీరోలు మాత్రం స్పందించలేకపోతున్నారు.

అయితే ఇక్కడ మన్సూర్ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నాడు అని కొంత లోతుగా పరిశీలిస్తే… తమిళ ఇండస్ట్రీతో పాటు ఇతర పరిశ్రమల్లో ఉన్న ప్రముఖలతో మన్సూర్ కి చాలా మంచి సాన్నిహిత్యం ఉందట. ముఖ్యంగా కోలీవుడ్ లో చాలా మంది స్టార్స్‌తో మన్సూర్ చాలా క్లోజ్ గా ఉంటారని సమాచారం. వారి సపోర్ట్ చూసుకునే మన్సూర్ ఇండస్ట్రీలో దూకుడుగా వ్యవహరిస్తాడని ఎప్పటి నుంచో ఓ టాక్ ఉంది.

- Advertisement -

ఇప్పుడు ఇంత పెద్ద వ్యవహారం జరిగినా, కోలీవుడ్ పెద్దలు ఇప్పటి వరకు నోరు తెరిచి స్పందించలేదు. లియో సినిమాలో త్రిషతో పాటు నటించిన విజయ్ దళపతి, గౌతమ్ మీనన్, అర్జున్, సంజయ్ దత్ కూడా ఇప్పటి వరకు మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించలేదు. కోలీవుడ్ లో సూపర్ స్టార్ అని ప్రతి రోజూ చెప్పుకునే రజినీకాంత్ కూడా ఇది తప్పు అని చెప్పలేకపోతున్నాడు. సొంతగా పార్టీ పెట్టి… సమాజాన్ని ఉద్దరిస్తానని చెప్పుకునే కమల్ హాసన్ కూడా నోరు ఎత్తడం లేదు.

ఇక ఎక్కడ చిన్న ప్రాబ్లమ్ ఉన్నా.. ట్విట్టర్ లో ఓ ట్వీట్ వేసి చేతులు దులుపుకునే అమితాబ్ బచ్చన్ కి ఈ ఇష్యూ ఇంకా కనిపించలేదా అంటూ నెటిజన్లు నుంచి వస్తున్న ప్రశ్నలు అయితే కోకొల్లలు. ఇటీవల బిగ బి… రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో విషయంలో స్పందించిన తీరు అందరినీ మెప్పించింది. మరీ ఇప్పుడు త్రిష విషయంలో బిగ్ బి ట్విట్టర్ ఎందుకు సౌండ్ చేయడం లేదు అనే ప్రశ్న వస్తుంది. ఇక టాలీవుడ్ నుంచి అయితే… మెగాస్టార్ చిరంజీవి ఓ ట్వీట్ వేసి తన పని అయిపోయింది అన్నట్టు సైలెంట్ అయిపోయాడు.

చిత్ర సీమలో పెద్దలం అని చెప్పుకుని తిరిగే.. ఈ స్టార్ హీరోలు అందరు
ఈ విషయంపై స్పందించకపోవడంతో… మన్సూర్‌తో ఏమైనా సంబంధం ఉందా? మన్సూర్ చేసిన తప్పును తప్పుబట్టడానికి వారి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ అడ్డొస్తుందా? అనే ప్రశ్నలు రాకమానదు.

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ మంత్రి సీనియర్ నటి.. రోజాపై ఓ రాజకీయ నాయకుడు ఓ కామెంట్ చేస్తే ఇటు ఇండస్ట్రీ నుంచి అటు రాజకీయం ఎంతో సపోర్ట్ వచ్చింది. అలాంటి సపోర్ట్ ఇప్పుడు త్రిష విషయంలో కరువైంది. సెలబ్రిటీలు ఇప్పుడు ఈ విషయంపై ఇంకా సైలెంట్ గా ఉంటే… మన్సూర్ తో సంబంధం గట్టిగానే ఉందని, అతనికి వీళ్లు సపోర్ట్ చేస్తున్నారు అనే మెసెజ్ వెళ్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు