Niharika: ఆ యంగ్ హీరోయిన్‌తో చైతన్య జొన్నలగడ్డ.. అందుకే నిహా వదిలేసిందా..?

Niharika:  టాలీవుడ్ మెగా బ్రదర్, నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఈమె పైన ఏదో ఒక రూమర్ వినిపిస్తూ ఉండేది. ముఖ్యంగా వివాహమైన తర్వాత ఏడాదిలోపే విడాకులు తీసుకోవడంతో మరింత వైరల్ గా మారింది.. మొదటిసారి నిహారిక తన విడాకుల గురించి ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ కి పలు విషయాలను తెలిపారు. నిహారిక మాట్లాడిన ఆ మాటలకు తట్టుకోలేక నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య కాస్త ఘాటు గానే స్పందించారు. దీంతో ఈ విషయం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.

అయితే పెళ్లి తర్వాత నిహారిక కు ఫ్రీడం లేకుండా పోయిందని.. ఈ కారణాల వల్ల ఆమె విడాకులు తీసుకున్నట్లు పలు రకాల రూమర్స్ వినిపించాయి.. కానీ చైతన్య మాత్రం ఈ విడాకులు విషయం పైన స్పందిస్తూ.. విడాకులు అనేది రెండు చివరిలో ఉంటాయి.. ఒకరి వైపు నిందించడం మరొకరిని హైలెట్ చేయడం మంచిది కాదంటూ .. ఈ విషయం పైన అసలు మూడో వ్యక్తి జోక్యం చేసుకోకూడదు అంటూ చైతన్య గట్టిగానే ఇచ్చి పడేశారు. అయితే నిహారిక – చైతన్య ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో నిహారిక ఎక్కువగా చాలా సమయం ఫ్రెండ్స్ తోనే గడపడం పైగా డ్రగ్స్ ఆరోపణలు కూడా రావడంతో విభేదాలు వచ్చాయి ..ఇలాంటి సమయంలోనే చైతన్య కూడా సినీ ఇండస్ట్రీలో ఉండే ఒక యంగ్ హీరోయిన్ తో చాలా చనువుగా మూవ్ అయ్యేవారట.. అందుకే వీరి మధ్య ఉన్న బంధం కారణంగా నిహారిక ని మోసం చేశారని… పైగా ఆ యంగ్ హీరోయిన్ తో చైతన్య ఎఫైర్ పెట్టుకున్నారనే రూమర్స్ కూడా వచ్చాయి. ఒకసారి హోటల్ గది లో ఆ యంగ్ హీరోయిన్ తో తన భర్త చైతన్యను చూసి తట్టుకోలేకపోయారట నిహారిక.

- Advertisement -

ఇక అప్పటినుంచి చైతన్యతో ఎప్పుడు మాట్లాడిన నిహారిక ఈ టాపిక్ తీసుకురావడం.. ఆ హీరోయిన్ పేరు చాలాసార్లు ప్రస్తావించడంతో నిహారిక – చైతన్య మధ్య తరచూ గొడవలు జరిగేవట. దీంతో ఈ గొడవలు ఎక్కువ అవ్వడంతో ఇద్దరు కలిసి ఉండలేక పెద్దలు అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం. నిహారిక కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. చైతూ ని చాలా నమ్మాను కాని ఇలా ఉంటాడు అనుకోలేదు.. రాంగ్ పర్సన్ మీద ఆధారపడకూడదు అంటూ పరోక్షంగా కామెంట్లు చేసింది. దీంతో కొంతమంది మెగా అభిమానులు పరోక్షంగా నిహారిక విడాకులకు తన భర్త వేరే మహిళతో ఉండడమే అన్నట్లుగా ఈ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారుతోంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు