Niharika: నిందించొద్దంటూ విడాకులపై నోరు విప్పిన మెగా అల్లుడు..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా, నిర్మాతగా, మెగాస్టార్ తమ్ముడిగా మంచి పాపులారిటీ సంపాదించారు నాగబాబు. ఆయన కూతురు నిహారిక సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అటు హీరోయిన్ గా.. ఇటు నిర్మాతగా కూడా సక్సెస్ కాలేకపోయింది. దీంతో జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. పెద్దలు సమక్షంలో వివాహం చేసుకున్నప్పటికీ.. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండలేకపోయింది. ఫలితంగా వివాహమైన ఏడాదిలోపే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో ఇటీవలే తన భర్తతో విడిపోవడానికి పలు కారణాలను వివరించింది నిహారిక.. ఒక ఇంటర్వ్యూలో నిహారిక విడాకులు తీసుకోవడానికి గల కారణాలు వెల్లడించడంతో ఈ ఇంటర్వ్యూ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో ఈ విషయంపై తన మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ.. నిహారిక మాట్లాడిన మాటలను ఖండిస్తూ తనదైన రీతిలో స్పందించారు.

ఇంటర్వ్యూ కు సంబంధించి ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ కింద చైతన్య జొన్నలగడ్డ కామెంట్స్ చేస్తూ.. “హాయ్ నిఖిల్.. నిహారిక ఎదుర్కొంటున్న ఇటువంటి పరిస్థితిని దూరం చేసేందుకు మీరు చేసిన ఈ ప్రయత్నాన్ని చాలా అభినందిస్తున్నాను.. వ్యక్తిగతంగా నన్ను దూషిస్తూ చూపిస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం చూసి తట్టుకోవడం చాలా బాధగా అనిపించింది.. ఇలాంటివి చేసేటప్పుడు దానికి కారణమైన వారిని ట్యాగ్ చేయడం మాత్రం నియంత్రించాల్సి ఉంటుంది” అని తెలిపారు..

“గతంలో కూడా ఇలాంటిదే జరిగింది.. ఇప్పుడు మళ్లీ రెండవసారి చేస్తున్నారు.. విడాకులు విషయమై ఒకరి వైపు నుంచి మాట్లాడకూడదు.. రెండు వైపుల నుంచి ఆ బాధ ఉంటుంది.. విడాకుల గురించి ఒకవైపు మాత్రమే మాట్లాడడం సరికాదు.. ఆ బాధ నుంచీ ఎలా కోలుకున్నామనే విషయం పైన మాట్లాడితే అందరికీ ఉపయోగకరంగానే ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆ సంఘటనలతో సంబంధం ఉన్న వారందరితో మాట్లాడి ప్రజలకు ఒక అవగాహన కల్పించాల్సి ఉంటుంది” అంటూ తెలిపారు..

- Advertisement -

అంతేకాకుండా జరిగింది ఏమిటో తెలుసుకోకుండా తీర్పు ఇవ్వడం ఎంత తప్పో ఇలాంటి వేదికల ద్వారా ప్రజలకు ఒకే కోణంలో ఆన్సర్ ను చెప్పడం కూడా అంతే తప్పు అంటూ.. దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ జొన్నలగడ్డ చైతన్య కామెంట్ చేశారు.. ఈ కామెంట్స్ వల్ల నిహారిక మాజీ భర్త చైతన్య ఇద్దరి వైపు తప్పు ఉందని చెప్పే ప్రయత్నాన్ని అయితే చేశారు అని చెప్పవచ్చు .. ఇక నిహారిక చెప్పిన దాంట్లో తనది తప్పులేదని చైతన్య కుటుంబం అంతా తప్పు చేసిందన్నట్లుగా చెప్పినట్టుగా కనిపిస్తోందని చైతన్య భావిస్తున్నారు. వ్యక్తిగత విషయంలో ఇలాంటివి జరిగినప్పుడు కచ్చితంగా ఆచితూచి స్పందించాల్సి ఉంటుంది అంటూ తెలిపారు చైతన్య. ప్రస్తుతం ఈ విషయం కాస్తా వైరల్ గా మారుతోంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు