Razakar : ఇది ఎవరికీ వ్యతిరేకంగా తీసిన సినిమా కాదు.. – ఇంద్రజ

టాలీవుడ్ లో ఈ వారం అన్ని చిన్న సినిమాలే రిలీజ్ అవుతుండగా అందులో అంచనాలతో, జనాల్ని ఆకర్షిస్తూ రిలీజ్ అవుతున్న సినిమా రజాకార్. ఈ సినిమా తెలంగాణ నిజాం కాలానికి చెందిన రజాకార్ల అరాచకాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఆడియన్స్ దృష్టిని బాగా ఆకర్షిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గాని ట్రైలర్ గాని మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అయితే ఈ సినిమాలో టెక్నికల్ గా విజువల్స్ పరంగా కొన్ని లోపాలున్నాయన్న మాట తప్పితే కంటెంట్ పరంగా మంచి కథాంశం తో రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే జనాల్ని మెప్పించే అవకాశం చాలా ఉంది. ఇక రజాకార్ మార్చి 15న పలు చిన్న సినిమాలతో పాటు పోటీగా రిలీజ్ అవుతూ ఉండగా ఈ సినిమాపైనే ఎక్కువ ఆసక్తి ఉందని అవుతున్న బుకింగ్స్ ని బట్టి తెలుస్తుంది.

రజాకార్ ఒక వర్గానికి సంబంధించింది కాదు -ఇంద్రజ

తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన నటి ఇంద్రజ రజాకార్ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంద్రజ మాట్లాడుతూ రజాకార్ సినిమా తాను చాకలి ఐలమ్మ గా నటించానని, ఇంతకు మించి ఇంకేం కావాలి అని ఎమోషనల్ అయింది. ఇంత గొప్ప పాత్ర ఇచ్చి, ఇంత మంచి చారిత్రాత్మక నేపథ్యంలో సినిమా తీసినందుకు దర్శక నిర్మాతలని ఇద్దరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాని తెలిపింది. అలాగే ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా రజాకార్ల అరాచకాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది గాని, రజాకార్ సినిమా ముస్లింలకు వ్యతిరేకం కాదని, కొందరు అన్యాయంగా తమ సినిమాని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. అలాగే నిజాం సంస్థానం మొత్తం చెడ్డవారు కారని, వాళ్లలో మొదటి ఆరు మంది నిజాం నవాబులు ప్రజలకి సేవ చేసారని, చివరి నవాబ్ అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ వచ్చాకే పరిస్థితులు మారిపోయాయని, రజాకార్ అయిన ఖాసీం రజ్వీ నేతృత్వంలో ఈ ఘోరాలు జరిగాయని, చరిత్ర తెలుసుకోవడానికి తప్పకుండా ఈ సినిమా చూడాలని పేర్కొంది.

- Advertisement -

అలాగే రజాకార్ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన వేదిక మాట్లాడుతూ ఈ సినిమాలో తన పాత్ర గురించి ప్రస్తావిస్తూ తాను శాంతవ్వ అనే పాత్రలో నటించానని తెలంగాణ భైరాన్ పల్లికి చెందిన ఒక పల్లెటూరి అమ్మాయి పాత్ర అది అని, ఫస్ట్ టైం ఒక హిస్టారికల్ పీరియడ్ బ్యాక్ డ్రాప్ మూవీలో నటించానని తెలిపింది.

ఇక రజాకార్ సినిమాను సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్ లో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించగా, యాట సత్యనారాయణ డైరెక్ట్ చేయడం జరిగింది. బాబీ సింహ ప్రధాన పాత్రలో, ప్రేమ, వేదిక, ఇంద్రజ, అనసూయ, మకరంద్ దేష్పాండే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక భీమ్స్ మ్యూజిక్ అందించిన రజాకార్ సినిమాలోని అన్ని పాటలు సుద్దాల అశోక్ తేజ రాయడం జరిగింది. ఇక ఫైనల్ గా మార్చి 15న సౌత్ భాషలన్నిటితో పాటు, హిందీలో కూడా తమ సినిమాని రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు